స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేం

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

తాడేపల్లి: కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈ నవంబర్‌లో నిర్వహించే పరిస్థితి లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  కోవిడ్‌ కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా.. మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా ఉందన్నారు. నవంబర్‌ నెలలో కోవిడ్‌ కేసులు పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. బిహార్‌ వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తప్పనిసరి అని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 
 

Back to Top