'ఆరోగ్యానికి భరోసా - ప్రగతికి హామీ'

మంత్రి కేవీ ఉషాశ్రీ చ‌ర‌ణ్

అనంత‌పురం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  'ఆరోగ్యానికి భరోసా - ప్రగతికి హామీ ఇస్తున్నార‌ని మంత్రి కేవీ ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు. మంగ‌ళ‌వారం అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 'ఆరోగ్యానికి భరోసా - ప్రగతికి హామీ' అనే నినాదంతో "ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య మేళా" (హెల్త్ క్యాంప్) కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు కె.వి.ఉష శ్రీ చరణ్, స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ,  జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ , ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పేద‌ల‌కు అందుతున్న వైద్య‌సేవ‌ల‌ను మంత్రి వివ‌రించారు. వైద్యం కోసం ఎవ‌రూ అప్పుల‌పాలు కాకూడ‌ద‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ్యేయ‌మ‌న్నారు.

తాజా వీడియోలు

Back to Top