నాడు కుల రాజకీయం, నేడు మత రాజకీయం

చంద్రబాబుపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ధ్వజం

తాడేపల్లి: అంతర్వేది రథం దగ్ధంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పందించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్‌ చేసిందన్నారు. రథం దగ్ధం ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కొత్త రథం తయారీ కోసం ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎవర్నీ ఉపేక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. తప్పుచేసిన వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

అంతర్వేది రథం దగ్ధం ఘటనను చంద్రబాబు లాంటి వారు రాజకీయాలకు వాడుకుంటున్నారని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. నిన్నటి వరకు కుల రాజకీయాలతో పబ్బం గడుపుకున్న చంద్రబాబు.. నేడు మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఎవరిపై చర్యలు తీసుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. విజయవాడలో దేవాలయాలను కూల్చివేసింది మర్చిపోయాం అనుకుంటున్నారా..? ఆ నాడు పరిశీలనకు వచ్చిన స్వామీజీలను అరెస్టు చేయించింది చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top