కుట్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ చంద్ర‌బాబు

గ‌వ‌ర్న‌ర్‌కు బాబు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి

వికేంద్రీక‌ర‌ణ‌కు ఎందుకు వ్య‌తిరేక‌మో స‌మాధానం చెప్పాలి

వికేంద్రీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు చంద్ర‌బాబు కొత్త కుట్ర‌ల‌కు తెర‌తీసే ప్ర‌మాదం ఉంది

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లకు అనుగుణంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

కాకినాడ‌: అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప‌నిచేస్తున్నార‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబు అన్నారు. ప‌రిపాల‌న రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్నం  అన్ని హంగుల‌తో శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లంతా స్వాగ‌తిస్తున్నార‌న్నారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ బిల్లును రాజ్యాంగానికి లోబ‌డి గ‌వ‌ర్న‌ర్ ఆమోదిస్తే.. గ‌వ‌ర్న‌ర్‌పై కూడా చంద్ర‌బాబు అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్‌కు చంద్ర‌బాబు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కాకినాడ‌లో మంత్రి క‌న్న‌బాబు విలేక‌రుల స‌మావేశం  నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడారంటే..

రాష్ట్ర ప్ర‌జ‌లంతా వికేంద్రీక‌ర‌ణ‌ను స్వాగ‌తిస్తున్నారు. చంద్ర‌బాబు ఎందుకు వికేంద్రీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నా.. రియ‌లెస్టేట్ ప్ర‌యోజ‌నాల కోసం అమ‌రావ‌తిపై విప‌రీత‌మైన ప్రేమ చూపిస్తున్నారు. ఒక ప్రాంతం మీద‌, కులం మీద ద్వేషంతో ప్ర‌భుత్వం ఇలా చేసింద‌ని చంద్ర‌బాబు అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఇది మంచి ప‌ద్ధ‌తి కాదు. ఇదే విశాఖ‌లో మీరు చెబుతున్న కులం లేదా..? క‌ర్నూలులో లేరా..? ఎందుకు ప్ర‌తి దానికి కులం, మ‌తం రంగు పుల‌మాల‌ని చూస్తున్నారు. అనుభ‌వ‌జ్ఞుడిని అని చెప్పుకునే చంద్ర‌బాబుకు ఇప్ప‌టికైనా జ్ఞానం అనేది రాలేదా..? ఏ కులాన్ని దెబ్బ‌తీయాల‌ని చూస్తున్నారు.

అమ‌రావ‌తి ప్రాంతంలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ఓడిపోయింది అక్క‌డే క‌దా.. విశాఖ‌లో న‌లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు.. ఇలాంటప్పుడు సిగ్గులేని మాట‌లు ఎలా మాట్లాడుతారు. టీడీపీ ఎమ్మెల్యే విశాఖ‌లో ప‌రిపాల‌న రాజ‌ధానిని స్వాగ‌తిస్తున్నాన‌ని చెప్ప‌డం చూశాం. ఒక ప‌క్క టీడీపీ నేత‌లు హ‌ర్షిస్తుంటే.. మ‌రోప‌క్క చంద్ర‌బాబుకు అనుకూల మీడియా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని క‌ట్టుక‌థ‌లు అల్లే కార్య‌క్ర‌మం చేస్తుంది. సీఎం నిర్ణ‌యానికి చంద్ర‌బాబు క‌ల‌త చెంది రాజ‌నామా చేయాల‌ని లీక్ ఇస్తున్నారు. చంద్ర‌బాబు జీవితం అంతా లీకుల‌తోనే గ‌డిచిపోతుంది.

గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ చంద్ర‌బాబు అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌భావ‌తం చేశార‌ని మాట్లాడుతున్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డం చంద్ర‌బాబుకు అల‌వాటు. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్న చంద్ర‌బాబు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి. కుట్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ చంద్ర‌బాబు. మ‌ళ్లీ ఈ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకునేందుకు కొత్త కుట్ర‌ల‌కు తెర‌తీసే ప్ర‌మాదం ఉంది.. ప్ర‌జ‌లంతా గ‌మ‌నించాలి` అని మంత్రి క‌న్న‌బాబు చెప్పారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top