ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్‌ చంద్రబాబు

డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడ: నాలుగు దశాబ్దాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు.. ఈ శతాబ్దపు డర్టీ పొటిటీషియన్‌ అని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే చంద్రబాబు పనిచేస్తాడని చెప్పారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వెన్నుపోటు, మోసం, దగా, కుట్రలకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నారు. బాబుతో స్నేహం కారణంగానే పవన్‌ మతిపోయిందని ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభంను పవన్‌ కల్యాణ్‌ అగౌరవపరిచాడని, హరిరామ జోగయ్య వయసు మీద పడి మాట్లాడుతున్నాడన్నారు.  
 

Back to Top