ప్రీప్లాన్డ్‌ ప్రకారమే బాయ్‌కాట్‌ డ్రామా

చంద్రబాబు రాజకీయ వ్యభిచారి.. మంగ‌మ్మ శ‌ప‌థాల‌ను ఎవ‌రూ న‌మ్మ‌రు

సానుభూతి కోసం కుటుంబ సభ్యులను కూడా రోడ్డుకీడుస్తాడు

అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని

అసెంబ్లీ: ప్రీప్లాన్డ్‌ ప్రకారమే చంద్రబాబు అసెంబ్లీ బైకాట్‌ డ్రామా ఆడారని, అసెంబ్లీ నుంచి ఏదో ఒక కారణంతో వెళ్లిపోవాలని నిన్న సాయంత్రమే తన పార్టీ పెద్దలతో చంద్రబాబు గంటల తరబడి చర్చించాడని, ఆ ప్లాన్‌ ప్రకారమే మంగమ్మ శపథాలు పెట్టి వెళ్లిపోయాడని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. సింపథీ కోసం నిన్న వేసుకున్న ప్లాన్‌ ప్రకారం గ్లిజరిన్‌ వేసుకున్నా చంద్రబాబుకు కన్నీరు రాలేదన్నారు. అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 

‘కుప్పం ఫలితాలు వచ్చిన తరువాత నిన్న ఉదయం చంద్రబాబు అసెంబ్లీలోని తన కార్యాలయానికి వచ్చాడు. సభ లోపలికి రావాలా.. వద్దా.. తేల్చుకోలేక నిన్న సాయంత్రం ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి.. పార్టీలో కొంతమంది పెద్దలను పిలిచి.. అసెంబ్లీని బైకాట్‌ చేస్తే ఎలా ఉంటుంది.. ఇంకో సంవత్సరం ఆగి చేద్దామా అని చర్చించుకున్నాడు. జయలలిత, ఎన్టీఆర్, వైయస్‌ జగన్‌ శపథం చేసి ముఖ్యమంత్రి అయి సభకు తిరిగొచ్చారు.. నేను కూడా శపథం చేసి వెళ్లి ముఖ్యమంత్రిగా రావొచ్చని నిన్నంతా టీడీపీలోని కొంతమంది పెద్దలతో చంద్రబాబు చర్చించాడు. 

ఒక మాటంటే ఆవేశంలో చొక్క చించుకుని నిర్ణయం తీసుకునే వ్యక్తి చంద్రబాబు కాదు. దీని వల్ల లాభం, నష్టం బేరీజు వేసుకుంటాడు. నిన్న సాయంత్రం అంతా చర్చించుకొని ఏదో ఒక కారణంతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన మహానుభావుడు చంద్రబాబు. హత్యల గురించి మొదలుపెట్టింది చంద్రబాబే. సీఎం వైయస్‌ జగన్‌రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను ఎన్నో రకాలుగా మాట్లాడిన దుర్మార్గాడు చంద్రబాబు. 

హత్యల గురించి మాట్లాడాలంటే వంగవీటి రంగ, ఎలిమినేటి మాధవరెడ్డి హత్య గురించి మాట్లాడాలి.. అన్నీ చర్చిద్దాం అని అంబటి మాట్లాడితే.. సింపథీ కోసం నిన్న వేసుకున్న ప్లాన్‌ ప్రకారం గ్లిజరిన్‌ వేసుకున్నా చంద్రబాబుకు కన్నీరు రాలేదు. ఆయన భార్యను ఆయనే అల్లరి చేసుకున్నాడు. రాజకీయం కోసం ఎవరినైనా రోడ్డు మీదకు ఈడుస్తాడు. చంద్రబాబు మంగమ్మ శపథాలను ఎవరూ నమ్మరు.’ అని మంత్రి కొడాలి నాని అన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top