బీసీలను ఓటుబ్యాంకుగా చూసిన దుర్మార్గుడు చంద్రబాబు

బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయ‌కుడు సీఎం వైయస్‌ జగన్‌ 

చిత్తశుద్ధితో పనిచేసి పదవులకు న్యాయం చేయాలి

బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లకు మంత్రి కొడాలి నాని సూచన

విజయవాడ: బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో దేశానికే సీఎం వైయస్‌ జగన్‌ ఆదర్శంగా నిలిచారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణా జిల్లా బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి పదవులకు న్యాయం చేయాలని సూచించారు. బీసీ వర్గాల్లో ఉన్న సమస్యలు, ఇబ్బందులను పరిశీలించి పరిష్కరించేందుకు కృషిచేసినప్పుడే ప్రభుత్వానికి, పదవుల్లో ఉన్నవారికి, కార్పొరేషన్‌ పదవులు క్రియేట్‌ చేసిన సీఎం వైయస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందన్నారు. అదే విధంగా బీసీలు అభివృద్ధి సాధిస్తారన్నారు. బీసీ విద్యార్థుల అభ్యున్నతికి సీఎం వైయస్‌ జగన్‌ బాటలు వేశారన్నారు. 

బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక, బీసీ అభ్యున్నతికి టీడీపీ పనిచేస్తుందని దొంగ మాటలు చెప్పి బలహీనవర్గాలను ఓటు బ్యాంకుగా చూసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top