ప్రస్తుతం 'స్థానిక' ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదు

ప్రజల శ్రేయస్సే ప్రభుత్వానికి ముఖ్యం

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

కృష్ణా: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతం నిర్వహించే ఆలోచన లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘కోవిడ్‌ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలి. గతంలో లాగా ఎన్నికల నిర్వహణకు ఎక్కువమందిని తరలించడం సాధ్యం కాదు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదు. నవంబర్, డిసెంబర్‌లో మరోసారి వైరస్‌ వ్యాప్తి జరిగే అవకాశం ఉంది. దసరా తర్వాత సెకెండ్‌ వేవ్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బిహార్‌ ఎన్నికలు కచ్చితంగా జరగాల్సిన పరిస్థితి. బిహార్‌ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి’ అని చెప్పారు. 
 

Back to Top