చంద్రబాబు ఒక పగటి వేషగాడు, పిట్టలదొర 

మంత్రి కొడాలి నాని 
 

విజయవాడ: చంద్రబాబు ఒక పగటి వేషగాడు, పిట్టలదొర అంటూ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఆదివారం గొల్లపూడిలో నిర్వహించిన 'వైఎస్సార్‌ ఆసరా' కార్యక్రమం సంబరాలకు మంత్రి కొడాలి నాని ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు.

చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడు. నేను, వంశీ ఫోన్లు చేసినా ఎత్తడు. మా ఫోన్లు బ్లాక్‌లో పెట్టేశాడు. దేవినేని ఉమా ఓ చవటదద్దమ్మ. ఉమా పకోడీ బెదురింపులకు అధికారులెవరూ భయపడొద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే కేసులు పెట్టండి. మీకు అండగా మేమున్నాం. 

చాలా మంది తెలుగుదేశం సన్నాసులకు ఓ విషయం తెలియదు. వైఎస్సార్‌సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ అంటే టీడీపీ కంటే బలమైన మాస్‌ ఇమేజ్‌ ఉన్న శక్తివంతమైన పార్టీ. గుడివాడైనా, మైలవరమైనా.. మరెక్కడైనా వైఎస్సార్‌సీపీ జెండానే ఎగురుతుంది' అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని​, ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, కైలే అనిల్‌ కుమార్‌, సీఎం ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top