మీలా వెన్నుపోటు పొడిచే రక్తం కాదు

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ గారిని విమర్శించే ముందు మీ చరిత్ర ఏంటో తెలుసుకోండి

 దమ్ముంటే గుడివాడలో నామీద పోటీ చేసి గెలువు లోకేష్..!

 న్యాయస్థానాలపై అచంచలమైన గౌరవం ఉందని వైయ‌స్ జగన్ గారు చెబితే.. కించపరిచారని తండ్రీకొడుకులు దుష్ప్రచారం

 అమ‌రావ‌తి: వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిలో ప్రవహించే రక్తం వైయ‌స్‌ రాజారెడ్డి, వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డిగార్ల రక్తమ‌ని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఎదురుగా వచ్చి గుండెల్ని చీల్చగల దమ్ము, ధైర్యం ఉన్న రక్తమే వైయ‌స్ జగన్‌గారిలో ప్రవహించేది. నీ తండ్రి చంద్రబాబు మాదిరిగా వెన్ను చూపించే వ్యక్తి కాద‌ని దుయ్య‌బ‌ట్టారు. మీలా పప్పుల్లా వెనుక నుంచి వెన్నుపోటు పొడిచే రక్తం కాదు. నీచాతి నీచమైన, నికృష్ణమైన బతుకు మీది. అందుకే ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టార‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కొడాలి నాని మాట్లాడారు.
 
  రాష్ట్రం సమగ్రమైన అభివృద్ధి జరగాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలని అసమానతలకు తావులేకుండా పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అసెంబ్లీ సాక్షిగా తాను నమ్మిన సిద్ధాంతాన్ని స్పష్టంగా, ఎలాంటి అరమరికలకు తావు లేకుండా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పారు. అయితే కొంతమంది శాసనసభ్యులుగా కూడా గెలవలేని బచ్చాగాళ్లు, ప్రజల్లో ఆదరణ కూడా లేని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే చెత్తగాళ్లు ముఖ్యమంత్రి జగన్ గారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.  మా తాత ముఖ్యమంత్రి, మాకో పార్టీ ఉంది. మా బాబు ముఖ్యమంత్రి, అతనో ప్రపంచ మేధావి.. ఆయనకో పెద్ద విజన్‌ ఉందంటూ సొల్లు మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. నిజంగా చంద్రబాబుకు విజనరీనే ఉంటే..  తన కొడుకుని ఎమ్మెల్యేగా కూడా ఎందుకు గెలిపించలేకపోయాడు. 

 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లతో వైఎస్‌ జగన్‌ గారిని ముఖ్యమంత్రి చేసిన రాష్ట్ర ప్రజలు అమాయకులు అని, తండ్రీకొడుకులే తెలివిగలవాళ్ళు అని వారికి వారే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో పప్పుగా గుర్తింపు పొందిన లోకేష్ అయితే కనీసం బుద్ధీ- జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. జగన్‌ గారు ఏం చదివారు, ఏ క్లాసులో పాస్ అయ్యారు.. అనేది అసెంబ్లీ సాక్షిగా మీ తండ్రి చంద్రబాబుకు గతంలోనే చెప్పారు. నీ మాదిరిగా, నీ తండ్రి రికమండేషన్ తో  ఊళ్లోవాళ్లు కట్టిన ఫీజులతో, పక్కదేశాలకు వెళ్లి చదువుకొని వచ్చిన వ్యక్తి కాదు జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. నూటికి నూరుశాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చదువుకుని, నూటికి నూరుశాతం రియల్టీలో జీవించిన వ్యక్తి. ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజల సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు తెలుసుకున్న వ్యక్తి జగన్‌గారు. నీ మాదిరిగా, తాత పేరు, తండ్రి పేరు చెప్పుకుని... దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి, మీడియా ముందే మొరిగే వ్యక్తివి నీవు. బాబాయ్‌ని బంధించిందీ, తాతను చంపింది మీరు కాదా...?

 దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియాగాంధీ పేరు చెబితే 40ఏళ్ల రాజకీయ అనుభవంతో పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడులాంటి నాయకులే భయపడే రోజుల్లో... సోనియాను వ్యతిరేకించి, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి దమ్ము, ధైర్యం ఉన్న మగాడు జగన్ మోహన్ రెడ్డిగారు. 16 నెలలు ఆయనను అక్రమంగా జైలులో పెట్టినా, ఏనాడూ వెన్ను చూపలేదు,  ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి, 151మందిని వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు.

  74 ఏళ్ళ వృద్ధుడైన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన బతుకులు మీవి. తెలుగుదేశం పార్టీనీ లాక్కుని, ముఖ్యమంత్రి పదవిని దొంగలించిన దొంగలు మీరు. అలాంటి నీచులైన మీకు,  ముఖ్యమంత్రి జగన్‌గారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. బాబాయ్‌ని చంపి రాజకీయ లబ్ది పొందాల్సిన ఖర్మ జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి కానీ, వైయస్సార్‌ గారి కుటుంబానికి కానీ లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరికాదు లోకేష్‌. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని అసమర్దుడువి అయిన నీకు, 151మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి అయిన జగన్‌ గారికి ఎక్కడా పోలిక లేదు. ఆకాశానికి, పాతాళానికి ఉన్నంత తేడా ఉంది. 

 లోకేష్‌కు దమ్ముంటే గుడివాడలో నాపై పోటీ చేసి గెలవాలి. జగన్‌గారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. చంద్రబాబు గారు అని సంభోదించారే కానీ, ఎక్కడా ఒక్క మాట తూలలేదు. ముఖ్యమంత్రిగారు న్యాయస్థానాలను, జడ్జిలను విమర్శించారంటూ తెలుగుదేశం పచ్చబ్యాచ్‌ ప్రచారం చేస్తోంది. 

  శాసన సభకు చట్టాలు చేసే హక్కులు ఉన్నాయి. మా పరిధులు, పరిమితులు ఏంటో మాకు తెలుసు. ఏ వ్యవస్థ అయినా మరో వ్యవస్థలో జోక్యం చేసుకోనంతవరకూ బాగానే ఉంటుంది. అలాకాకుండా జోక్యం చేసుకుంటే అనేక వివాదాలు ఏర్పడి రాష్ట్రం నష్టపోతుంది. కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వేరే వ్యవస్థలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్‌ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంది. మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఇందుకోసం న్యాయ సలహాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. 

  న్యాయ స్థానాలపై అపారమైన గౌరవం ఉందని, ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచన చేస్తామని సీఎం గారు చెప్పారు. చట్టాలు చేసే హక్కు శాసనసభకు, పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని, చట్టసభకు హక్కులు ఉన్నాయని చర్చ సందర్భంగా అసెంబ్లీలో చెబితే, దానికి శవాలు మీద పేలాలు వేరుకునే చంద్రబాబు, ఆయన తనయుడు... న్యాయవ్యవస్థను ఏదో అన్నారు, గౌరవం లేదంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. పేద ప్రజలను, అట్టడుగు వర్గాలవారిని గౌరవించే మనస్తత్వం జగన్‌గారిది. అలాంటి ముఖ్యమంత్రిగారిని విమర్శించే ముందు మీ చరిత్ర ఏంటో ముందుగా తెలుసుకుని మాట్లాడితే మంచిది.

Back to Top