వైయ‌స్ జగన్ మరో 30 ఏళ్ళు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు 

 పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని)

 రెండేళ్ళ పరిపాలన చూశాక.. 2014లోనే వైయ‌స్ జగన్ కు అధికారం ఇచ్చినట్టైతే రాష్ట్రం మరింత ముందుకెళ్ళేది

 2014లో బాబుకు అధికారమిస్తే.. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చి, తన వాళ్ళకు దోచిపెట్టాడు 

 అభివృద్ధి, సంక్షేమమే కాదు.. పేదలకు, అట్టడుగు వర్గాల వారికి నేనున్నా అని భరోసా కల్పించిన సీఎం వైయ‌స్ జగన్

 మేనిఫెస్టోను చంద్రబాబు తప్పుడు పత్రంగా మార్చితే... భగవద్గీత, బైబిల్, ఖురాన్ తరహాలో దైవంగా వైయ‌స్ జగన్ భావించారు 

 కరోనాతో అనాథలైన పిల్లలు భవిష్యత్తు కోసం రూ. 10 లక్షలు సాయం చేస్తున్న సీఎం వైయ‌స్ జగన్ దేశానికే ఆదర్శం 

  వాజ్ పేయ్ హయాంలో ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడిన దుర్మార్గుడు, దుష్టుడు చంద్రబాబే 

 తెలుగుదేశంగానీ, రాష్ట్రంలో ఉన్న మరే ఇతర పార్టీలుగానీ రాజకీయంగా మాకు ప్రత్యర్థే కాదు. 

వైయ‌స్ జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు, ఆయన కొడుకు బతికుండగా దించలేదు. 

 ప్రజలు, దేవుని ఆశీస్సులు వైయ‌స్ జగన్ కి ఉండగా, ఈ ఎల్లో మిడతలు ఏం చేయలేవు. 

వైయ‌స్ జగన్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అంతా ఎలా కాలగర్భంలో కలిసిపోయారో, ఎలా జీవచ్ఛవాల్లా బతుకుతున్నారో చూస్తున్నాం. 

 చంద్రబాబు ప్రజలను నమ్మడు.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడిని నమ్ముకుని రాజకీయం చేస్తున్నాడు

 తాడేప‌ల్లి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో 30 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ఉండాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని  పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి రెండేళ్ళు పూర్తైన రోజు.. రెండేళ్ళ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన, దేశంలో ఎక్కడా జరగని విధంగా, రెండేళ్ళుగా ఈ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం- అభివృద్ధి కార్యక్రమాలను చూసినతర్వాత.. 2014లోనే ఆయనకు అధికారాన్ని అప్పజెప్పినట్లైతే.. రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళి ఉండేదని ఈరోజు ప్రజలు భావిస్తున్నార‌ని చెప్పారు.  2014లో వైయ‌స్ జగన్ గారికి అధికారం ఇవ్వలేకపోయినందుకు  తప్పు చేశామని ప్రజలు అనుకునే పరిస్థితి. ఆరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన బీసీలు, ఆఖరికి ఆయన సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు కూడా అదే భావిస్తున్నార‌ని పేర్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా మానవత్వంతో, పేదవాడి అభివృద్ధే లక్ష్యంగా పరిపాలన సాగిస్తోన్న వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో.. ఈ రాష్ట్రం  మరింత ముందుకు వెళ్ళి ఉండేదని ప్రజలు అనుకుంటున్నార‌ని చెప్పారు.   వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా పద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేసి నేటికి రెండేళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

 2014లో చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే.. రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరలా మార్చి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన సొంత మనుషులకు రాష్ట్ర సంపదను దోచి పెట్టాడు. 

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో రెండేళ్ళలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున అమలు చేయడమే ఒక్కటే కాదు, పేదలకు, అట్టడుగు వర్గాల వారికి నేనున్నా అనే భరోసా కల్పించారు. అక్షరాలా 1 లక్షా 31 వేల కోట్ల రూపాయల సంపదను పేదలకు, బడుగు, బలహీనవర్గాలకు తరలించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు. 

 సంక్షేమంపై కేవలం రెండేళ్ళలో ఇంతగా ఖర్చు చేసిన నాయకుడు రాష్ట్ర చరిత్రలో చూసినా, దేశ చరిత్రలో చూసినా గతంలో ఎవరూ ఉండి ఉండరు. కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని కరోనా వైద్యానికి అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి, పిల్లలు అనాథలైతే.. ఆ పిల్లల భవిష్యత్తు కోసం రూ. 10 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 
 ఈరోజు కేంద్రం కూడా కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు ఆర్థిక సాయం ఇస్తామని ముందుకొచ్చింది. 
 108, 104 అంబులెన్సులు గానీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో 16 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టబోతున్నాం. 
 రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యానికి సంబంధించి 70 సంవత్సరాల చరిత్ర ఒక ఎత్తు అయితే.. ఈ రెండేళ్ళలో ముఖ్యమంత్రి జగన్ గారు చేపట్టిన చర్యలు ఒక ఎత్తు. ఈ రెండేళ్ళలోనే 16 మెడికల్ కాలేజీలకు శంఖుస్థాపనలు చేస్తున్నామంటే.. కళ్ళు ఉన్న ప్రతి వ్యక్తికీ ఇవి కనపడతాయి. 
 ఈ దేశంలో 108 అంబులెన్స్ లు ఎన్ని ఉన్నాయో తెలియదుగానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రతి మండలానికి అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు.  పేదవాడు వైద్యానికి ఇబ్బంది పడకూడదనే తపనతో జగన్ గారు పనిచేస్తున్నారు.

 మేనిఫెస్టో అంటే దానిని ఒక తప్పుడు పత్రంగా, ఒక దొంగ పుస్తకంగా చంద్రబాబు మార్చితే... జగన్ మోహన్ రెడ్డిగారు భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి చూపించారు. ఈ రెండేళ్ళలో 95 శాతం హామీలు అమలు చేశారు. మేనిఫెస్టోను దైవంతో భావించి, ఇచ్చిన ప్రతి హామీని తూ.చ తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ గారు ఒక్కరే. 

 పక్కా ఇళ్ళు, పింఛన్లు, అమ్మ ఒడి.. ఇలా ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కులం, మతం, ప్రాంతం, పార్టీలు,  రాజకీయాలు చూడకుండా, తనకు ఓటు వేశారా.. లేదా అని చూడకుండా.. దేవుడు అధికారం ఇచ్చాడు.. ఆ అధికారం ద్వారా పేదలకు ఉపయోగపడాలని అహర్నిశలు జగన్ గారు పనిచేస్తున్నారు.  ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డిగారే మరో 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. 

 చంద్రబాబు జూమ్ యాప్ పెట్టుకుని మహానాడు పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు.. ఆయన చనిపోయిన రోజున మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని గుర్తుకొస్తుంది.  గత 20 ఏళ్ళుగా భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానాలు చేస్తూనే ఉన్నాడు.   ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని వాజ్ పేయ్ హయాంలో.. ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పెద్దఎత్తున కోరితే, ఆరోజు ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు కాదా..?

 ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే.. లక్ష్మీపార్వతి ద్వారా అది వస్తుందని అడ్డుపడిన దుర్మార్గుడు, దుష్టుడు చంద్రబాబు. 
  సిగ్గులేకుండా ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజు.. ఆయన సమాధి దగ్గరకు వెళ్ళి ఆయన ఆశయాలు నెరవేరుస్తాం.. భారత తర్న ఇవ్వాలని మాట్లాడుతుంటే.. ప్రజలు ఛీ కొడుతున్నారన్న బుద్ధీ, జ్ఞానం కూడా వీళ్ళకు లేదు. 

 ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన దుర్మార్గులే మళ్ళీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిగారిపైన కుట్రలు చేస్తున్నారు. పనికిమాలిన సన్నాసులు పది మంది పోగై,  చంద్రబాబుకు ఏ విధంగానైనా మళ్ళీ అధికారం ఇప్పించాలని కుట్రలు చేస్తున్నారు. 
 పక్క రాష్ట్రంలో కూర్చుని జూమ్ యాప్ లో.. తుప్పు నాయుడు, పప్పు నాయుడు ఇద్దరూ రోజూ మాట్లాడుతున్నారు. 
  లోకేష్ కు శరీరం పెరిగింది కానీ.. బుర్ర పెరగలేదు.
 
వైయస్ రాజశేఖరరెడ్డిగారు రెండుసార్లు 2004, 2009లో మీ తండ్రి తుప్పు నాయుడిని తుక్కు తుక్కుగా ఓడించారు. ఏ పీకారు అని మాట్లాడుతున్న లోకేష్ కు ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదో..!
 2019 ఎన్నికల్లో మీ తండ్రిని, మంగళగిరిలో నిన్ను ఘోరాతిఘోరంగా ఓడించింది కూడా డాక్టర్ వైయస్ఆర్ గారి కుమారుడు వైయ‌స్ జగన్ గారే .. ఇప్పుడు మీ తండ్రిని జూమ్ యాప్ కు, పక్క రాష్ట్రానికి పరిమితం చేసింది కూడా జగన్ మోహన్ రెడ్డిగారే. 
 
లోకేష్ ను, మీ తండ్రిని మరో నాలుగుసార్లు ఓడించడానికి జగన్ మోహన్ రెడ్డిగారు, ఆయన సైన్యం సిద్ధంగా ఉంది.
 మంగళగిరిలో కూడా గెలవలేని వ్యక్తికి, దొడ్డిదారిన మూడు మంత్రి పదవులు కట్టబెట్టి.. మీ తండ్రి తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు. అదే వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు నిన్న ఎమ్మెల్యేగా కూడా గెలవనీయకుండా, అసెంబ్లీ గేటు దాకా కూడా రానివ్వకుండా చేశారు.

 ఇంకా, ఏం పీకాలి.. బట్టలు ఊడదీసి రోడ్డు మీద నిలబెట్టినా.. ఇంకా సిగ్గు లేకుండా తండ్రీకొడుకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 

 ప్రజల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులతో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టే పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికలు అన్నింట్లో 80 శాతంపైగా గెలిచారు. పరిషత్ ఎన్నికల్లో కనీసం మీరు పోటీ చేయడానికే భయపడి పారిపోయారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో రెండేళ్ళ తన  పాలనను చూసే ప్రజలు ఓట్లు వేస్తారని,  ప్రజల మీద నమ్మకం పెడితే.. గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సాధించాం. ప్రజల పట్ల జగన్ మోహన్ రెడ్డిగారికి ఉన్న నిబద్ధత.. ప్రజలకు ఆయన పట్ల ఉన్న నమ్మకం దీన్నిబట్టి అర్థమవుతుంది. 

 చంద్రబాబు మాదిరిగా నాలుగు టీవీలు, రెండు పత్రికలు పెట్టుకుని నిత్యం ప్రజలను వంచిస్తూ అధికారం కోసం అర్రులు చాచే నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారి ఇంటా వంటా కాదు.. జగన్ గారిని ఏ ప్రజలు అయితే గెలిపించారో.. ఆ ప్రజల కోసమే పనిచేస్తున్నారు. వైస్రాయ్ హోటెల్ లో క్యాంపులు పెట్టుకుని, పేపర్లు, టీవీలను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, వారి దయా, దాక్షిణ్యాల కోసం, వారికి ఊడిగం చేస్తూ.. బ్రోకర్ పనులు చేసిన వ్యక్తి చంద్రబాబు. అటువంటి చంద్రబాబు ప్రజా నాయకుడు అయిన జగన్ గారిని విమర్శించే హక్కు గానీ, అర్హత గానీ లేదు. 

 కరోనా విపత్కర కాలంలో.. అంతా సమైక్యంగా పనిచేస్తుంటే, రాజకీయాలే లక్ష్యంగా జూమ్ యాప్ వేదికగా చంద్రబాబు పనిచేస్తున్నాడు. చంద్రబాబుకు ప్రజలు ఎంతగా బుద్ధి చెప్పినా.. ఇంకా ప్రజలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు, ఆయన కొడుకుని రాజకీయంగా సమాధి చేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలో ఉంటేనే మాకు మంచి చేకూరుతుందని ప్రజలంతా ముక్తకంఠంతో ఈరోజు భావిస్తున్నారు. 

 వెన్నుపోటుదారుడైన చంద్రబాబుకు గంటకు ఒక మాట.. పూటకో విధానం ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా అరాచకాలు చేసి, ప్రజల సొమ్మును లూటీ చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదు. చంద్రబాబు సహకారంతో ఎవరైతే తప్పుడు కార్యక్రమాలు చేశారో.. వారిపై చర్యలు తీసుకుంటున్నాం.

 రాజకీయంగా తెలుగుదేశం పార్టీగానీ, రాష్ట్రంలో ఉన్న మరే ఇతర పార్టీగానీ మాకు అసలు ప్రత్యర్థే కాదు.  ఇదే చంద్రబాబు, ఇదే తెలుగుదేశం నేతలు అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డిగారిని ముఖ్యమంత్రి కాలేరని ఎంతగానో అవహేళన చేశారు. చివరికి ఏమైంది...? ప్రజలు, దేవుని ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డిగారికి ఉండగా, ఈ ఎల్లో మిడతలు ఏం చేయలేవు. 

 వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వాన్ని చంద్రబాబు, ఆయన కొడుకు బతికుండగా దించలేదు. పార్టీని కాపాడుకోవాలంటే ప్రతి ఎన్నికల ముందు మేమే అధికారంలోకి వస్తున్నామని తండ్రీకొడుకులు కార్యకర్తలను మభ్య పెడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఎక్కడ..?
వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారి చిటికెన వేలు కూడా వీళ్ళు కదిలించలేరు. జగన్ మోహన్ రెడ్డిగారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎలా కాలగర్భంలో కలిసిపోయారో, ఎలా జీవచ్ఛవాల్లా బతుకుతున్నారో చూస్తున్నాం. చంద్రబాబు, ఆయన కొడుక్కి కూడా అదే గతి పడుతుంది. 
 ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయనకు ద్రోహం చేసి, ఆయన పార్టీని లాక్కున్న వాళ్ళంతా ఎన్టీఆర్ అభిమానులం అని గంటలకొద్దీ ఉపన్యాసాలు చెబితే ఎవరు నమ్ముతారు.? 

 బీజేపీకి చంద్రబాబు మద్దతు ఇస్తామంటుంటే.. ఆ పార్టీ నాయకులు మీ మద్దతు మాకొద్దు బాబూ అని తిట్టినా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతన్నాడు. ఈరోజు పక్క రాష్ట్రంలో ఉంటూ, జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టుకుంటూ చంద్రబాబు దిక్కులేని బతుకు బతుకున్నాడు. 
 2004లో చంద్రబాబు కూటమి పెడితే... వైయస్ గారు దానిని తునాతునకలు చేశాడు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ తో కలిస్తే.. చంద్రబాబుతో పాటు, కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కూడా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు.   ఈరోజు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారిని ఎదుర్కోవడానికి అందరూ కట్టకట్టుకుని కలిసి వచ్చినా.. వీళ్ళందరినీ ఎదుర్కొనే సత్తా ఆయనకు ఉంది. 
 చంద్రబాబును నమ్మి డిపాజిట్లు రాని పార్టీలు ఒకరు ఇద్దరూ ఆయనతో కలుస్తారేమోగానీ.. బుద్ధి ఉన్న వాళ్ళెవరూ కలవరు. 
  చంద్రబాబు ప్రజలను నమ్మడు. రామోజీ, రాధాకృష్ణ, కొత్తగా బీఆర్ నాయుడిని నమ్ముకున్నాడు. వాళ్ళు ఏం చెబితే అది చేస్తాడు. ఉన్నపళంగా జగన్ మోహన్ రెడ్డిగారిని అధికారం నుంచి దించేసి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ స్థాయి, వాళ్ళ నాలెడ్జ్ ఆ స్థాయిలో ఉంది మరి. 

అట్టడుగున ఉన్న బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకురావాలని పనిచేస్తున్నఏకైక నాయకుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు. అదే చంద్రబాబు వర్గీకరణ పేరుతో ఎస్సీలను విడగొట్టాడు. కులాల్ని, మతాలన్ని అడ్డం పెట్టుకుని, అధికారం కోసం ఎలా అడ్డదారులు తొక్కుతున్నారో చూస్తున్నామ‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top