చంద్ర‌బాబు ఇంట్లో ఉంటూ జైలు జీవితం గ‌డుపుతున్నారు

మంత్రి కొడాలి నాని

చంద్ర‌బాబు కోర్టుల నుంచి త‌ప్పించుకోవ‌చ్చేమో గానీ ప్ర‌జ‌ల నుంచి శిక్ష త‌ప్ప‌దు

మేం ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి నుంచి భూ కుంభ‌కోణం జ‌రిగింద‌ని చెప్తున్నాం

గ‌త మార్చిలోనే  సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కేబినెట్ ఆమోదంతో కేంద్రాన్ని కోరాం

సీఎం ఆదేశాల‌తో ఏసీబీ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు 

చంద్ర‌బాబు ప్ర‌మేయం ఉంద‌ని తేలితే ఆయ‌న మీద కూడా కేసు 

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు ముందే శిక్ష వేశార‌ని..ఆయ‌న ఇంట్లో ఇంటూ జైలు జీవితం గ‌డుపుతున్నార‌ని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తి భూ స్కామ్‌లో చంద్ర‌బాబు ప్ర‌మేయం ఉంద‌ని తేలితే ఆయ‌న మీద కూడా కేసులు పెడ‌తామ‌ని మంత్రి హెచ్చ‌రించారు. బుధ‌వారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. అమ‌రావ‌తిలో రాజ‌ధాని వ‌స్తుంద‌ని టీడీపీ నేత‌ల‌కు ముందే తెలుసు. భూములు కొనుగోలు చేసుకోవాల‌ని టీడీపీ నేత‌లకు చంద్ర‌బాబు ముందే చెప్పారు. రాజ‌ధానిలో రైతుల‌ను మోసం చేసి ఎక‌రం రూ.25 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేశారు. టీడీపీ నేత‌లు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గ‌డించారు.

రాజ‌ధాని వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు అండ్ కో బాగుప‌డ్డారు. మేం ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి నుంచి భూ కుంభ‌కోణం జ‌రిగింద‌ని చెప్తున్నాం. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కుంభ‌కోణంపై  కేబినెట్ స‌బ్ క‌మిటీ, సిట్ నియ‌మించాం. గ‌త మార్చిలోనే అమ‌రావ‌తి రాజ‌ధాని భూ కుంభ‌కోణంపై  సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కేబినెట్ ఆమోదంతో కేంద్రాన్ని కోరాం. క‌రోనా వ‌ల్లో లేక‌పోతే సిబీఐకి దేశవ్యాప్తంగా అనేక కేసులు ఉండ‌టంతో జాప్యం జ‌రిగింది. కేంద్రం నిర్ణ‌యం రాక‌పోతే ఏసీబీ ద‌ర్యాప్తున‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. సీఎం ఆదేశాల‌తో ఏసీబీ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టింది.

చంద్ర‌బాబు, అత‌ని బినామీలు కోట్లాది రూపాయలు లాయ‌ర్ల ఫీజులు చెల్లించి ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో ప్ర‌జ‌లకు తెలుసు. ఈ కుంభ‌కోణంలో చంద్ర‌బాబు ప్ర‌మేయం ఉంద‌ని తేలితే ఆయ‌న మీద కూడా కేసులు పెడ‌తారు. చంద్ర‌బాబు కోర్టుల నుంచి త‌ప్పించుకోవ‌చ్చేమో గానీ ప్ర‌జ‌ల నుంచి శిక్ష త‌ప్ప‌ద‌ని కొడాలి నాని హెచ్చ‌రించారు. చంద్ర‌బాబు 40 ఏళ్ల రాజ‌కీయ జీవిత‌లో ప్ర‌తి వ్య‌వ‌స్థ‌లోనూ సొంత మ‌నుషుల‌ను పెట్టుకొని వాళ్ల‌ను అడ్డం పెట్టుకుని ఇప్పుడు త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారని కొడాలి నాని విమ‌ర్శించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top