ఛీప్‌ లిక్కర్‌ కనిపెట్టిందే చంద్రబాబు

మంత్రి కొడాలి నాని

చంద్రబాబు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు

240 బ్రాండ్స్‌కు పర్మిషన్‌ ఇచ్చింది చంద్రబాబే

అమరావతి: దేశంలోనే ఛీప్‌ లిక్కర్‌ను కనిపెట్టింది చంద్రబాబేనని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు గతంలో రాష్ట్రాన్ని పాలించడం మన దురదృష్టమన్నారు. రాష్ట్రంలో 240 బ్రాండ్లకు పర్మిషన్‌ ఇచ్చిన వ్యక్తి ఆయన అని గుర్తు చేశారు. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో ఏపీలో అదే గతి పడుతుందని సూచించారు. బుధవారం టీడీపీ సభ్యులు సభా సమయాన్ని అడ్డుకోవడంతో మంత్రి కొడాలి నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత 11 రోజులుగా టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. మొదట సారాపై చర్చించాలని కోరిన టీడీపీ సభ్యులు ఇవాళ కొత్త డిమాండ్‌తో ఆందోళన చేపట్టడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు సభ బయట ఉండి..ఆ పార్టీ నేతలకు తప్పుడు డైరెక్షన్‌ ఇస్తున్నారని దుయ్యబట్టారు. 

టీడీపీ నేతలు మూడు రోజులుగా మూడు విడతలుగా సస్పెండ్‌ అయ్యారు.  టీడీపీలో మిగిలిన నలుగురు, ఐదుగురు స్పీకర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మర్యాదగా ఉంటున్నారు. అయితే బయట ఉన్న వ్యక్తి వీరిని బెదిరిస్తున్నారు.  తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత వారుణి వాహిని అని పేరు పెట్టి సారాను సరఫరా చేసింది. సారా ఎలా బాటిలింగ్‌ చేయాలని, ఎలా తాపించాలో నేర్పించిన పార్టీ టీyî పీ. 

దేశంలో ఛీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తి చంద్రబాబు. దరిద్రపుగొట్టు ఆలోచన చేసి ఛీప్‌ లిక్కర్‌ తెచ్చిన వ్యక్తి చంద్రబాబు. జే బ్రాండ్‌కు లైసెన్స్‌ ఇచ్చిన నిష్ట దరిద్రుడు చంద్రబాబు. 240 బ్రాండ్లకు పర్మిషన్‌ ఇచ్చింది చంద్రబాబే. ఈ రోజు వాటిని వైయస్‌ జగన్‌ తెచ్చినట్లు సిగ్గులేకుండా ఆర్జిమర్స్‌తో బాధపడుతున్న చంద్రబాబు మాట్లాడుతున్నారు. బ్రెయిన్‌ పని చేయక పిచ్చెక్కి మాట్లాడుతున్న చంద్రబాబుకు బుద్ధి లేదు. వీరికైనా ఆలోచన ఉండాలి కదా? చంద్రబాబు హయాంలో 40 వేల బెల్ట్‌షాపులు తెరిచారు. పర్మిట్‌రూమ్‌లను, బెల్ట్‌షాపులను మూయించిన ఘనత వైయస్‌ జగన్‌ది. వైన్‌షాపుల సంఖ్యను, బార్లను తగ్గించింది వైయస్‌ జగన్‌. కోర్టు స్టే ఆర్డర్లతో ఇప్పుడు కొందరు బార్లు నడుపుకుంటున్నారు. వీరికి చంద్రబాబు అండగా నిలిచారు. 
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు.   దేశంలో ఛీప్‌ లిక్కర్‌ను కనిపెట్టిన ఛీప్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్టీఆర్‌ మద్యపానాన్ని తెస్తే..చంద్రబాబు  మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో ఇక్కడ కూడా అదే గతి పడుతుంది. వైయస్‌ జగన్‌పై, ప్రభుత్వంపై ఏరకమైన విమర్శలు చేసే అవకాశం లేక సిగ్గులేని చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ నేతలు సభకు వచ్చి సభా సమయాన్ని వృథా చేస్తున్నారు. మీరైనా పార్టీ మారండి..లేదంటే అందరూ కలిసి కట్టకట్టుకొని ఏటైనా వెళ్లండి అంటూ టీడీపీ నేతలకు మంత్రి కొడాలి నాని సలహా ఇచ్చారు. టీడీపీని ఎవరు పట్టుకుంటే వారు సర్వనాశనం అవుతారు. సభలో ఉన్న టీడీపీ నేతలు సభకు సహకరించాలని మంత్రి కొడాలి నాని కోరారు. 
 

తాజా వీడియోలు

Back to Top