వైయ‌స్ జగన్‌ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు

పిచ్చిరాతలు రాస్తే సహించం..

అధికారం కోసం క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు 

మంత్రి కొడాలి నాని

 తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేర‌ని మంత్రి కొడాలి నాని అన్నారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, సీఎం వైయ‌స్ జగన్‌ను తక్కువ చేయాలని తప్పుడు రాతలు రాసి.. రాధాకృష్‌ణ ప్రజల్లో క్రెడిబిలిటి పోగొట్టుకున్నాడ‌న్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏబీఎన్‌ అసత్యాలు ప్రచారం చేస్తోందని  కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏబీఎన్‌ రాధాకృష్ణ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

 చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలన్న కాంక్షతో పిచ్చి రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన కుటుంబసభ్యులను కూడా నమ్మరు. అధికారం కోసం క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.  గత పదేళ్లుగా వైయ‌స్ జగన్‌ వ్యక్తిత్వంపై ఎల్లో మీడియా దాడులు చేస్తోందని.. పార్టీలో చేరడానికి కండిషన్స్‌ పెట్టే దుస్థితి సీఎం వైయ‌స్‌ జగన్‌కు లేదన్నారు.

వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌లో అందరూ స్వచ్చందంగానే చేరారని.. ఎల్లో మీడియా పిచ్చిరాతలు రాస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కోర్టుల్లో పరువునష్టం దావా వేస్తామని మంత్రి హెచ్చరించారు.  

రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పాలన సాగుతోందని.. అది చూసి ఓర్వలేక ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూడు నెలలకోసారి ఏపీకి వచ్చే చంద్రబాబుకు పబ్లిసిటీ కోసం దీక్షలు చేయడం అలవాటేనని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.  ప్రజల గుండెల్లో వైయ‌స్ఆర్, వైఎస్ జగన్‌ ఉన్నతస్థాయిలో ఉన్నారని మంత్రి నాని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top