మా పార్టీ నేతల హత్యలకు చంద్రబాబు బాధ్యత వహిస్తారా?

మంత్రి కొడాలి నాని 

చంద్రబాబు, లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకోవాలి

సీఎం వైయస్‌ జగన్‌ రైతు బాంధవుడు

21 రోజుల్లోపు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నాం

లోకేష్‌ పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు

పప్పు, తుప్పు ఇద్దరూ ఇంటికే పరిమితమయ్యారు

ఇంట్లో కూర్చుని జూమ్‌లో కాలక్షేపం చేస్తున్నారు

చంద్రబాబు పెట్టిన బకాయిలు రూ.4 వేల కోట్లు మా ప్రభుత్వం చెల్లించింది

కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయం

ఊక, ధాన్యానికి తేడా తెలియని వ్యక్తి చంద్రబాబు

టీడీపీ హయాంలో జరిగిన హత్యలకు చంద్రబాబు బాధ్యత వహిస్తాడా?

గ్రామాల్లో ఘటనలను మాపై ఆపాదించడం కరెక్టా?

కత్తులతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే

శత్రువులతో కూడా శభాష్‌ అనిపించుకునే వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ 

చంద్ర‌బాబు చిటికేసినా..లోకేష్ త‌ప్పెట్లు కొట్టినా..వైయ‌స్ జ‌గ‌న్‌ను తాక‌లేరు

పిచ్చి వాగుడు వాగితే లోకేష్‌కు బడిత పూజ తప్పదు

 తాడేపల్లి: చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో హత్యలు జరగలేదా? వైయస్‌ఆర్‌సీపీ నేతల హత్యలకు చంద్రబాబు బాధ్యత వహిస్తాడా అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎక్కడో గ్రామాల్లో జరిగే గొడవలను సీఎం వైయస్‌ జగన్‌కు ఆపాదించడం కరెక్టు కాదన్నారు.  ముఖ్యమంత్రిపై నారా లోకేష్‌ కర్నూలులో చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. అచ్చొచ్చిన అంబోతులా కొడుకును చంద్రబాబు రోడ్లపైకి వదిలాడని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తండ్రీ కొడుకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బడిత పూజ చేస్తార ని హెచ్చరించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. 

పప్పుగాడు, తుప్పుగాడు ఇద్దరు ఇంటికి పరిమితమై ఏమీ చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో జూమ్‌ యాప్‌ పెట్టి..ప్రజల్లో వైయస్‌ జగన్‌పై వ్యతిరేక భావనలు తెచ్చేందుకు మాట్లాడుతున్నారు. పేజీలకు పేజీలు లేఖలు రాసి ప్రెస్‌కు విడుదల చేయం..గ్రామ రాజకీయాలతో ఎవరో చనిపోతే ఈ పప్పుగాడు కర్నూలు వెళ్లి..సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అరే..ఒరే అని మాట్లాడుతున్నాడు. 

మొన్న  తుప్పుగాడు..చంద్రబాబు గాడు..మా సీఎంకు ఓ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుంది. తానైతే 48 గంటల్లో డబ్బులు ఇచ్చేవాడిని..మీరు నెల రోజులైనా ధాన్యం డబ్బులు చెల్లించడం లేదని, తక్షణమే చెల్లించాలని పిచ్చి మాటలు రాసి మీడియాకు ఇచ్చాడు.

చంద్రబాబూ..నీవు మనిషివేనా? అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా?. నీ ప్రభుత్వ హయాంలో రైతులకు బకాయిలు కట్టకుండా వదిలేస్తే ..మేమెచ్చిన తరువాత ఆ బకాయిలు చెల్లించాం. రూ.996 కోట్లు రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు సీఎం వైయస్‌ జగన్‌ చెల్లించాడు. ఇన్‌ఫుట్‌ సబ్పిyî , పావలా వడ్డీ రుణాలు అన్ని కలిపి దాదాపు రూ.4 వేల కోట్లు చంద్రబాబు రైతులకు ఇవ్వాల్సిన బాకీలను 2019లోనే సీఎం కాగానే మూడు నెలల్లో చెల్లించిన రైతు బాంధవుడు సీఎం వైయస్‌ జగన్‌. అలాంటి ముఖ్యమంత్రిపై నీవు విషం కక్కుతున్నావు.

2014 ఎన్నికల సమయంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చావు, మీ భార్యల మెడలోని బంగారాన్ని బ్యాంకుల నుంచి తెచ్చి ఇస్తానని మోసం చేశాడు. కోటి మందిని మోసం చేసి కోటయ్య కమిటీ వేసి రూ.87 వేల కోట్లు ఉన్న అప్పులను రూ.24 వేల కోట్లకు తెచ్చి ..దాన్ని కూడా ఐదు స్ట్రోక్‌లు అని చెప్పి..రెండు స్ట్రోక్‌లు మాత్రమే చెల్లించి రైతులకు పంగనామాలు పెట్టిన నీచుడు చంద్రబాబు.
ఈ రోజు సివిల్‌ సప్లై 28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఈ సీజన్‌లో కొన్నాం. మొదటి నుంచి రైతులకు ధాన్యం ఇచ్చిన 21 రోజుల్లోనే చెల్లిస్తామని చెప్పాం. రూ.1637 కోట్లు రైతులకు చెల్లించాం. 1619 కోట్లు రైతులకు ఇవ్వాలి. కేంద్రం రాష్ట్రానికి అడ్వాన్స్‌గా ఇవ్వాల్సిన రూ.3200 కోట్లు ఇవ్వకపోయినా కూడా ప్రతి రోజు రాష్ట్ర ఖజనా నుంచి రూ.200 కోట్లు రైతులకు చెల్లిస్తున్నాం.

 చంద్రబాబుకు కేంద్రానికి లేఖ రాసేందుకు భయం. మొన్న సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లి సివిల్‌ సప్లైకి ఉన్ను 3200 వేల కోట్లు బకాయిలు చెల్లించాలని మంత్రిని కోరారు. ఇవన్నీ తుప్పుగాడికి కనిపించవు. వీటిని గాలికి వదిలేసి వైయస్‌ జగన్‌పై ఏదో రకంగా బురద జల్లుతున్నారు. 

 దల్వాయి సీజన్‌లో 45 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనాల్సి ఉంటుందని అనుకున్నాం. అది 40 లక్షలకే వస్తుందని భావిస్తున్నాం. గిట్టుబాటు ధర కంటే ఎక్కువ ధర వస్తుండటంతో రైతులు బయటకు అమ్ముకున్నారు. ప్రతి గింజ కూడా కొనాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. మిల్లర్లు కొన్నా..కొనకపోయినా కూడా ప్రభుత్వమే ప్రతి గింజను కొంటుంది.

ఊకకు ధాన్యానికి తేడా తెలియని దద్దమ్మ చంద్రబాబు. మొన్న కొంత మంది రైతులు ఊక తెచ్చి హడావుడి చేశారు. ఉమా గాడు అక్కడికి వెళ్లి మహిళలతో కొట్టించుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబుకు లాంటి ద్రోహులు, వెన్నుపోటుదారుల వద్ద నుంచి మా ప్రభుత్వానికి నీతులు చెప్పించుకునే పరిస్థితి లేదు.

పప్పుగాడికి ఇంట్లో సరిగా ఫుడ్‌ పెట్టడం లేదేమో. దున్నపోతులా పెరిగావు..ఎందుకురా నీకు కంచాలు కంచాలు అని తిండి పెట్టడం లేదేమో. చంద్రబాబు చిటికేస్తే వైయస్‌ జగన్‌ను పాదయాత్రలో తిరగనిచ్చేవాడు కాదట. ఒరే పప్పు..నీ బాబు తుప్పు గాడు చికిటేసినా, నీవు వచ్చి తప్పెట్లు కొట్టినా..వైయస్‌ జగన్‌ చిటికెన వేలుపై ఉన్న బొచ్చు కూడా తండ్రి కొడుకులు పీకలేరు. చంద్రబాబు ఊరంతా నీతులు చెబుతాడు. వాడికి ఈ దున్నపోతు కనిపించడం లేదు. ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు, వీడు అంటాడా? నీ అయ్య 14 ఏళ్లు సీఎంగా పని చేశాడు.ఎప్పుడైనా సీబీఐ విచారణ వేశాడా? సీఎం వైయస్‌ జగన్‌ వచ్చిన తరువాత మూడుసార్లు సీబీఐ విచారణ వేయాలని కేంద్రాన్ని కోరారు. ఇదే సీబీఐని రాష్ట్రానికి రావద్దని జీవో తెచ్చిన నీ అబ్బ తుప్పుగాడు. 

బూతుల మంత్రి అని నన్ను అంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్లు అనుకొండి. మా సీఎం వైయస్‌ జగన్‌ను వాడు, వీడు అని సంబోధిస్తే..అరే చంద్రబాబు, ఒరే లుచ్చా లోకేష్‌..ఒరే పప్పుగా, అరే బోకేష్‌..పిచ్చి వాగుడు వాగితే బాబు, కొడుకులకు ఇద్దరికి తాటా తీస్తాం. ఏంట్రా వాడు చిటికేసేది..నీవు పీకేది. చంద్రబాబు చిటికేసినా, నీవు తప్పెట్లు కొట్టినా, ఉన్న అధికారంలో లేకపోయినా, వైయస్‌ జగన్‌ను ఒక వ్యక్తిగా కూడా తాకలేరు. వైయస్‌ జగన్‌ ప్రజాబలం ముందు, ఆయనకు ఉన్న నిగ్రహ శక్తి, మంచి తనం ముందు నీవు, నీ అయ్య ఇద్దరూ కూడా వెయ్యి జన్మలు ఎత్తినా కూడా వైయస్‌ జగన్‌ గోరు కూడా తాకలేరు. నీవు రోడ్ల మీదికి వచ్చి వైయస్‌ జగన్‌ గురించి ఇష్టం వచ్చినట్లు తిడితే..నీ అయ్య చరిత్ర, నీ చరిత్ర బట్టబయలు చేస్తాం. బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం. 

చంద్రబాబుకు ఉన్నది ఒక్కడే కొడుకు. నిన్న కర్నూలులో లోకేష్‌ అంటాడు..కత్తితో తిరిగినోడు కత్తితో పోతాడట. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది నీ అయ్యకాదు. వెనుకనుంచి పొడిచింది నీ బాబు కాదు. చంద్రబాబు జూబ్లీíß ల్స్‌లో ఉంటున్నాడు. నీవెందకు ఫాం హౌస్‌లో ఉన్నాడు. ఎందుకో తెలియదా? వెన్నుపోటు పొడుస్తావనే నిన్ను బయటకు పంపించాడు. నీ చరిత్ర, నీ బాబు చంద్రబాబు, వాడి బాబు ఖర్జుర నాయుడు, ఆయన బాబు కిస్‌మిస్‌ నాయుడు చరిత్ర ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. డిబెట్‌ పెట్టుకుంది. వైయస్‌ జగన్‌ ఏంటి, వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏంటి? వైయస్‌ రాజారెడ్డి చరిత్ర ఏంటో చర్చిద్దాం. మీ వాగుడు ఇలాగే ఉంటే..వైయస్‌ జగన్‌ చిటికెలు వేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు పప్పుగాడికి దేహ శుద్ధి చేస్తారు. S 

లోకేష్‌ వి్రరవీగుతున్నావు..శాసన మండలిలోనే నీవు ఒరే..అరే అని వాగితే..అక్కడే మా ఎమ్మెల్సీలు బడితే పూజ చేస్తారు. అదే మండలిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు సింహానివా? నీవు కుక్కవి. సింహం అడవిలో గర్జిస్తుంది. కుక్క వీధుల్లో అరుస్తుంది. నీవు, నీ బాబు యూజ్‌లెస్‌ ఫెలోస్‌..పిచ్చి వాగుడు వాగకుండా నోరు అదుపులో పెట్టుకొని బతకాలని ఆ ఇద్దరిని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. 

లోకేష్‌ అనే వాడు బ్రెయిన్‌ లెస్‌..వాడు బోకేష్‌..ఎక్కడ ఎవరు చచ్చినా వైయస్‌ జగన్‌ చంపించాడని చెబుతుంటాడు. టీడీపీ హయాంలో 14 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఎక్కడా చనిపోలేదా? . ఆ ఘటనలకు అన్నింటికి చంద్రబాబే బాధ్యత వహిస్తాడా?. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కానివ్వండి. చనిపోయిన కుటుంబాలను చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లమంటారా? ఆ కుటుంబాలకు చంద్రబాబు బాధ్యత వహిస్తారా? గ్రామాల్లో జరిగిన గొడవలకు సీఎం వైయస్‌ జగన్‌కు ఆపాధించడం ఎంత వరకు న్యాయం. చంద్రబాబు లాగా వైయస్‌ జగన్‌ వదిలేసి ఉంటే ఎంత మంది చనిపోయేవారు. వైయస్‌ జగన్‌ మమ్మల్ని కంట్రోల్‌ చేయబట్టే ఇంత ప్రశాంతంగా టీడీపీ నేతలు తిరుగుతున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను వాడు వీడు అని సంభోదించడం, రాజారెడ్డి రాజ్యాంగం అంటూ పిచ్చి వాగుడు వాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
చంద్రబాబు, లోకేష్, టీవీ 5 బీఆర్‌ నాయుడు, ఈటీవీ రామోజీ రావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ ఎట్టి పరిస్థితిలోనూ వైయస్‌ జగన్‌ను అధికారంలోకి దించాలని ఆరాటపడుతున్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబును సీఎం చేద్దామని తహతహలాడుతున్నారు. వైయస్‌ జగన్‌ శ్రీరామా అన్న కూడా వారికి బూతులాగే వినిపిస్తుంది.

కోవిడ్‌ సమయంలో, ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలులో ఎక్కడైనా టీడీపీ వాళ్లకు ఇవ్వవద్దని వైయస్‌ జగన్‌ ఆపేశాడా? టీడీపీకి చెందిన ఎంత మందికి గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు వచ్చాయి. నా నియోజకవర్గంలోనే చాలా మంది టీడీపీ నేతల పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. నా వద్దకు టీడీపీ యాక్టివ్‌ మెంబర్లు వచ్చి వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. శత్రువులతో కూడా శభాష్‌ అనిపించుకునే వ్యక్తి వైయస్‌ జగన్‌. సొంత పార్టీ నేతలతోనే తిట్లు తినే క్యారెక్టర్‌ చంద్రబాబుది. 

కుల మతాలకు అతీతంగా తెరిచిన పుస్తకంలా ప్రజల ముందు ఆవిష్కరిస్తున్న వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు, మరణాలు కప్పిపుచ్చకుంటున్నారు. మేం కూడా అలాగే చేద్దామంటే..వైయస్‌ జగన్‌ వద్దంటున్నారు. మనం క్రెడిబులిటీ సంపాదించుకుందామని చెప్పారు. ఎంత కష్టమైనా సరే క్రెడిబులిటీ సంపాదించుకోవాలన్నదే నా తపన అని చెప్పారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఒక్క అబద్ధం కూడా చెప్పవద్దని వైయస్‌ జగన్‌ చెబుతున్నారు. క్రెడిబులిటీ కోసం ప్రాకులాడే వ్యక్తి వైయస్‌ జగన్‌ అయితే..అధికారం కోసం అడ్డమైన వారి సంక నాకే రకం చంద్రబాబు. అడుక్కు తిని అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా సిగ్గు రావడం లేదు. 

లోకేష్‌ అనే వ్యక్తి కోటలో ఉన్నా..పేటలో ఉన్న ఒక్కటే. మంగళగిరిలో వైయస్‌ జగన్‌ అభ్యర్థిపై గెలవలేని వ్యక్తి లోకేష్‌. వీడి జీవితంలో ఎమ్మెల్యే కాలేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు. వాడి ఫేస్‌కు, వాడు చెప్పే మాటలకు ఏమైనా సింక్‌ అవుతాయా? వాడు వచ్చి చూసేడి ఏంటి. వీడు వైయస్‌ జగన్‌ విశ్వరూపం చూడగలడా?. చంద్రబాబుకు మరో దిక్కు లేదు కాబట్టే..లోకేష్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు. వీడు బయటకు వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. దమ్ముంటే ముందుకు ఎమ్మెల్యేగా గెలవాలని కొడాలి నాని సవాలు విసిరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top