కరోనా కంటే చంద్రబాబు అత్యంత ప్రమాదకారి

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

తాడేపల్లి: కరోనా కంటే ప్రతిపక్షత నేత చంద్రబాబు అత్యంత ప్రమాదకారి అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. విపత్కర పరిస్థితులను కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజారోగ్యమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని, కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు. కరోనా వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చామన్నారు. అదే విధంగా 104 కాల్‌ సెంటర్‌ను బలోపేతం చేసి.. ఫోన్‌ చేసిన వారికి మూడు గంటల్లోనే ఆస్పత్రుల్లో బెడ్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాల ద్వారా పేదలను ఆదుకుంటున్నామని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top