పవన్‌ సొల్లు కబుర్లన్నీ పేమెంట్‌ కోసమే..

ఓటమి భయంలోనే చంద్రబాబు ‘బహిష్కరణ’ డ్రామా

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

కృష్ణా: ఓటు హక్కు లేని పిల్లలతో సీఎం సీఎం అని పిలిపించుకునే పవన్‌ కల్యాణ్‌.. ప్యాకేజీ పేమెంట్‌ కోసం సొల్లు కబుర్లన్నీ చెబుతున్నాడని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. పవన్‌ను నమ్ముకున్న జన సైనికులు.. జన సైకిల్‌గా మారారని ఎద్దేవా చేశారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. రూరల్‌లో వైయస్‌ఆర్‌ సీపీ బలంగా ఉందనే పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ డ్రామాకు చంద్రబాబు తెరలేపారన్నారు. మళ్లీ ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారన్నారు. లోకేష్‌ మంగళగిరిలో ఓడిపోయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వస్తాయో రావో చూసుకోవాలన్నారు. సీపీఎం, బీజేపీ నోటాతో పోటీ పడే పార్టీలంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. 
 

Back to Top