విచారణ ఎదుర్కోలేని చవట, దద్దమ్మ చంద్రబాబు

బాబుకు స్టేలు తాత్కాలికమే.. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

విజయవాడ: భారతదేశంలోనే అత్యంత పిరికి వ్యక్తి.. విచారణను ఎదుర్కోలేని చవట, దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే.. అది చంద్రబాబు మాత్రమేనని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. అతన్ని చంద్రబాబు కాదు.. స్టే బాబు అని కూడా అంటారని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. అసైన్డ్‌ భూముల కుంభకోణంలో సీఐడీ నోటీసులపై కోర్టులో క్యాష్‌ పిటిషన్‌ దాఖలు చేసి స్టే తెచ్చుకున్న చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విమర్శణాస్త్రాలు సంధించారు. ఏ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 

కేసు వాదించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుప్రీం కోర్టు నుంచి లాయర్లను తెచ్చుకున్నాడన్నారు. కేసును పూర్తిగా రద్దు చేయాలని క్యాష్‌ పిటిషన్‌ వేశాడని, కోర్టు నాలుగు వారాల పాటు చంద్రబాబుపై విచారణ ఆపాలని స్టే ఇచ్చిందని, మిగిలిన విచారణ కొనసాగించాలని గౌరవ న్యాయస్థానం వెల్లడించిందన్నారు. చంద్రబాబుకు స్టేలు తాత్కాలికమే అయినా.. ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్నారు. తిరుపతి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. 
 

Back to Top