చంద్రబాబు కుటుంబాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా

బాబు ఎంత నీచుడో, నికృష్టుడో రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా

తెలివితేటలు ఒక్క రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడుకే ఉన్నాయా..? 

పరిజ్ఞానం ఉన్నవారితో చర్చా వేదికలు నడిపించండి

చంద్రబాబు కృత్రిమ ఉద్యమంపై ప్రజలందరికీ క్లారిటీ ఉంది

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

కృష్ణా: పదవి కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతాడని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. రెండెకరాల పొలం నుంచి రూ. 2 లక్షల కోట్ల వరకు రాష్ట్ర ప్రజల ధనాన్ని ఎలా దోచుకున్నాడో.. చంద్రబాబు ఎంత నీచుడు,  నికృష్టుడో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నది తన ఉద్దేశమన్నారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయం తన చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. ఎవరైనా ఆయన గురించి మాట్లాడితే.. పక్కన ఉండే ఊరకుక్కలతో సోషల్‌ మీడియాలో తిట్టిస్తాడని ధ్వజమెత్తారు. పనిపాట లేని వర్ల రామయ్య లాంటి పనికిమాలిన వాళ్లు చంద్రబాబు దగ్గర 10 మంది ఉంటారన్నారు. టీడీపీలో పనిలేని వారు తనపై ఫిర్యాదు చేస్తే ఏమౌతుంది. ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా చంద్రబాబు కుటుంబాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. 

మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి కొడాలి నాని అన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అడ్డంకుల కారణంగానే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా పడిందన్నారు. ఎవరెన్ని కేసులు వేసినా చట్టబద్ధంగా మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమాలపై ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు, అమరావతి రైతులకు క్లారిటీ ఉందన్నారు. 

రాష్ట్ర ప్రజలు, పేదలను దృష్టిలో పెట్టుకుని ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అభ్యంతరం చెప్పవద్దని, కోర్టుల్లో కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వని చోట శాసన రాజధానిని కంటిన్యూ చేయవద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరడం జరిగిందన్నారు. ఈటీవీ, ఏబీఎన్, టీవీ–5 లాంటి చానల్స్‌లో చర్చావేదికల పేరుతో అడ్డమైన వారిని పెట్టి బూతులు తిట్టిస్తున్నారని, 29 గ్రామాల సమస్య గురించి రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందని కొన్ని టీవీల్లో వెనక్కి, ముందుకి ఊపుతున్నారన్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఏమీ కాదు.. బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. తెలివితేటలు ఒక్క రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడులకే ఉన్నాయని అనుకుంటారని ఎద్దేవా చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సరైన పరిజ్ఞానం, అవగాహన ఉన్న వాళ్లను పెట్టి చర్చించాలని ఎల్లో మీడియాకు సూచించారు.  

Back to Top