చంద్రబాబే పెద్ద భిక్షగాడు

ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టడమేంటీ..?

బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపించిన నరరూప రాక్షసుడు

నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్, వైయస్‌ఆర్‌ కుటుంబాలు

సీఎం వైయస్‌ జగన్‌ వల్లే నేను మంత్రిగా ఉన్నాను

ఉమక్కాయ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి

వదినను చంపి రాజకీయాల్లోకి వచ్చావని అందరికీ తెలుసు

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు ఓ పెద్ద భిక్షగాడు.. ఆయన నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటీ..? నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్, వైయస్‌ఆర్‌ కుటుంబాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గతంలో ఎన్టీఆర్‌ను చూసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లానని, చంద్రబాబును, ఆయన బాబు ఖర్జూరనాయుడు, తాత లవంగం నాయుడిని చూసి వెళ్లలేదన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తనకు రెండు సార్లు ఎమ్మెల్యేని చేశారని, వైయస్‌ జగన్‌ వల్లే మంత్రిని అయ్యానని స్పష్టం చేశారు. ‘దేవినేని ఉమక్కాయ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి’ అని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

ఈ రోజు, రేపు, మనం ఉన్నన్ని రోజులు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి ఏ ప్రభుత్వాలు వచ్చిన కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేయకూడదు. వాటిల్లో ముఖ్యమైంది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌. గతంలో 2004కు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. రైతులకు ఎన్టీఆర్‌ ఇచ్చిన హార్స్‌పవర్‌కు రూ.50 (ఒక విద్యుత్‌ కనెక్షన్‌కు రూ.50) తీసుకొని రైతులు ఎన్ని గంటలు విద్యుత్‌ వాడుకున్నా.. బిల్లు లేకుండా పెట్టిన పథకం. దాన్ని నీరుగార్చి రైతుల దగ్గర కరెంట్‌కు డబ్బులు వసూలు చేసి వారు డబ్బులు కట్టలేకపోతే విద్యుత్‌ మీటర్లు ఊడబెరికి.. వారిని మానసికంగా ఇబ్బందికి గురిచేశారు. రైతులు ఆందోళన చేయడానికి బషీర్‌బాగ్‌కు వస్తే దుర్మార్గంగా కాల్చి చంపించిన దుర్మార్గుడు, నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు. 

అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్‌ఆర్‌.. మేము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తామని, వారు కట్టాల్సిన బకాయిలు రద్దు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే రైతులు కట్టాల్సిన బిల్లులను రద్దు చేస్తూ.. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తూ మొదటి సంతకం పెట్టిన వ్యక్తి వైయస్‌ఆర్‌. ఆయన బొమ్మ, ఆయన పేరు మా పార్టీ జెండా, ఎజెండాలో ఉంటుంది. ఆయనకు వన్నె తెచ్చేవిధంగా, ఆయన పేరు పది కాలాలు నిలబడే విధంగా సీఎం వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. వైయస్‌ఆర్‌ పేరు నిలబట్టేందుకు పనిచేస్తున్నారు. 

చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ కలిసి అక్రమ కేసులు పెట్టి జైలు పంపించి ఇబ్బందులు పెట్టినా.. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ప్రజల అంగీకారంతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వైయస్‌ జగన్‌. చంద్రబాబు దిగిపోతూ రూ.8 వేల కోట్ల పైచిలుకు కరెంట్‌ బకాయిలు పెట్టి వెళ్లారు. వాటిని మా ప్రభుత్వం వచ్చాక చెల్లించాం. మనం ఉన్నా.. లేకపోయినా.. రైతులకు ఇచ్చే విద్యుత్‌ శాశ్వతంగా ఉండిపోవాలన్న దృక్పథంతో సీఎం వైయస్‌ జగన్‌ 10 వేల మెగా వాట్లతో ఏపీ గ్రీన్‌ ఎనర్జీ అనే పేరుతో పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేçస్తున్నారు. అది పూర్తిగా రైతులకే ఉపయోగిస్తారు. 

ఈ రోజు రైతులకు ఇచ్చే విద్యుత్‌ యూనిట్‌కు 6 రూపాయలకు పైగా పడుతుంది. ఏటా ప్రభుత్వానికి రూ.8,353 కోట్ల భారం ప్రభుత్వానికి పడుతుంది. పవర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయడం వల్ల సగం భారం దిగిపోతుంది. అదే విధంగా రైతులు, డిస్కంలు, ప్రభుత్వం ఒక అగ్రిమెంటై ప్రతి నెలా రైతుకు మీటర్‌ పెట్టి ఎంత విద్యుత్‌ వాడుకున్నాడని బిల్లు ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌కు పంపిస్తే.. ఆ రైతుల ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేసి..ఆ డబ్బును డిస్కంలకు చెల్లించడం జరుగుతుంది. రైతులు వాడుకున్న విద్యుత్‌ చార్జీలను ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తుంది. మనం ఉన్నా లేకపోయినా రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందాలని సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. 

చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకొని బాకా ఊదే ఎల్లో మీడియా ఉంది. ఎల్లో మీడియా అధినేతలకు ఏపీలో ఒక్క ఎకరా భూమి లేదు.. ఉచిత కరెంట్‌ వాళ్లకు రాదని విషం కక్కుతున్నారు. చంద్రబాబు వ్యవసాయ దారుడు కాదు.. పేడ, పాలు, పెరుగు, రైతులు పండించే ధాన్యాన్ని  తక్కువ ధరకు కొనుగోలు చేసి హెరిటేజ్‌లో అమ్ముకునే బ్రోకర్‌ చంద్రబాబు. వీళ్లకు రైతులపై అపారమైన ప్రేమ పుట్టుకొచ్చింది. పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టించాలని చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని బాకా ఊదే ఎల్లో మీడియా వల్ల ఎటువంటి నష్టం జరగదు. 

రైతు సంక్షేమం కోసం సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. ఆర్‌బీకే సెంటర్లతో ఎరువులు, విత్తనాలు నాణ్యమైనవి అందిస్తున్నాం. రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500 అందజేస్తున్నాం. పంట కొనుగోలు కూడా ఆర్బీకేలు పర్యవేక్షించేలా.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించేలా సీఎం వైయస్‌ జగన్‌ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైతులు వైయస్‌ఆర్‌ను, వైయస్‌ జగన్‌ను నమ్మారు. రైతులకు న్యాయం చేసే ప్రభుత్వం మాది. 

అచ్చెన్నాయుడిని ఎవరైనా హింసించగలరా..? ఈఎస్‌ఐ స్కామ్‌లో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి విచారణ చేశారు. ఎవరైనా పైల్స్‌ ఆపరేషన్‌ చేయించుకున్న వాళ్లు 70 రోజులు ఆస్పత్రుల్లో ఉన్నవారు ఉన్నారా..? మహా అయితే వారం రోజులకంటే ఎక్కవ ఆస్పత్రిలో ఉండరు. అచ్చెన్నాయుడు డ్రామాలు ఆడుతున్నారని, ఏ సమస్య లేదని కోర్టులో సడ్మిట్‌ చేసి జైల్‌లో పడయలేమా..? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కోర్టులు ఏరకంగా చెబితే ఆ రకంగా ముందుకెళ్లండి. ఎవరినీ బలవంతంగా జైల్లో పెట్టాల్సిన అవసరం మనకు లేదని సీఎం చెప్పారు. 

అంతరిక్షంలోకి వచ్చినట్లుగా చంద్రబాబు రాష్ట్రంలోకి ప్రవేశించాడు. చేతులకు గ్లౌజు, పెద్ద మాస్కు, కళ్లజోడు పెట్టుకొని వచ్చాడు. దోమల మీద దండయాత్ర చేసిన చంద్రబాబు కరోనా మీద ఎందుకు దండయాత్ర చేయడం లేదు. హుద్‌హుద్‌ తుఫాన్‌కు ఎదురెళ్లిన చంద్రబాబు.. కరోనాను చూసి ఎందుకు పారిపోతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తోంది. ఏ ఒక్క కేసును దాయకుండా.. అన్ని ప్రజల ముందు పెట్టి మెరుగైన వైద్యం, ఆహారం, వసతులు కల్పిస్తున్న ప్రభుత్వం వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం. చంద్రబాబుకు వైయస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి, హక్కు లేదు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. 

దేవినేని ఉమక్కాయ్‌.. అంతరిక్షం నుంచి కిందకు వచ్చినట్టు ఉంటాడు. దేవినేని ఉమా వాళ్ల తండ్రి మైసూర్‌ మహారాజా..? కంజనచర్లలో క్రాంతి కూల్‌డ్రింక్స్‌ షాప్‌ దేవినేని ఉమా తండ్రిది కాదా..? సోడాల చిన్ని అని మీ నాన్నను పిలవరా..? దేవినేని ఉమ సోడా కాయలు కడిగేవాడు. నీ నాయకుడు చంద్రబాబు చంద్రగిరిలో ఎన్టీఆర్‌ పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయాడు. మంగళగిరిలో పప్పు ఓడిపోలేదా..? ఉమక్కాయ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వదినను చంపి రాజకీయాలకు వచ్చావని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి కోసం పిల్లనిచ్చిన మామను చంపాడు.. నువ్వు రాజకీయాల్లోకి రావడం కోసం వదినను చంపావు. మీ దగ్గర నేర్చుకోవాలా..?

రాష్ట్రంలో చంద్రబాబు ఓ పెద్ద భిక్షగాడు. నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటీ..? నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్, ఆయన తనయుడు హరికృష్ణ, మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ను చూసి ఆ పార్టీలోకి వెళ్లాను.. చంద్రబాబును, ఆయన బాబు ఖర్జూరనాయుడు, తాత లవంగం నాయుడిని చూసి వెళ్లలేదు. కాబట్టి నువ్వో బిచ్చగాడివి.. మీ నాయకుడు ఒక బిచ్చగాడు. వైయస్‌ జగన్‌ నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ దయవల్ల రాష్ట్ర మంత్రిగా ఉన్నా. నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్‌ కుటుంబం, వైయస్‌ఆర్‌ కుటుంబం. దేవినేని ఉమక్కాయ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top