శంకుస్థాపనలు చేసినట్లు బాబు నిరూపిస్తే రాజీనామా చేస్తా

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అసెంబ్లీ: ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఎయిర్‌పోర్టుకు గానీ చంద్రబాబు శంకుస్థాపన చేశారని నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్లిపోతానని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సవాలు విసిరారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడన్నారు. అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. బెంగళూరు, బాంబే, కలకత్తా, ఢిల్లీ అని చెబుతున్నాడని, ఇవన్నీ చంద్రబాబు పుట్టకముందు నుంచి మహానగరాలని ఎద్దేవా చేశారు. రూ. 2 లక్షల కోట్లు తెచ్చి పెట్టుబడులు పెడితే అప్పుడు సంవత్సరానికి రూ.50 వేల కోట్లు వస్తే వాటితో అభివృద్ధి చేస్తానని అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడన్నారు. చంద్రబాబు చాలా తక్కువ సమయం ఇచ్చి అబద్ధాల మాటల నుంచి విముక్తి కల్పించాలని స్పీకర్‌ను కోరారు

Back to Top