దళిత మహిళ చనిపోతే లోకేష్ శవ రాజకీయాలు

ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌ సీఎంకు సవాల్ విసరడమేంటి?

మంత్రి కొడాలి నాని

విజ‌య‌వాడ‌: దళిత మహిళ చనిపోతే లోకేష్ శవ రాజకీయాలు చేశాడని మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు. ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదో ప్రశ్నించాలన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌ సీఎంకు సవాల్ విసరడమేంటని మంత్రి ఎద్దేవా చేశారు. ఘటన జరిగిన 12 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారని.. దిశా చట్టం తెచ్చి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు.  

 విద్యారంగంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంస్కరణలు చేపట్టారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఓట్లు లేకపోయినా విద్యార్థులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పథకాలను పక్కదోవ పట్టించడానికే బాబు.. లోకేష్‌ను పంపి హైడ్రామా చేయించాడని మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top