చంద్రబాబుకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలి

పేదల రక్తం పీలుస్తున్న జలగలు బీజేపీ నేతలు

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది

కేంద్రం పెట్రోలుపై రూ.40 పెంచి ఐదు రూపాయలు తగ్గించింది

క్రూడాయిల్‌ రేట్లు తగ్గినా..పెట్రోల్‌ ధరను మోదీ పెంచారు

చంద్రబాబుకు వయసు వచ్చింది కానీ..బుద్ధి రాలేదు

చంద్రబాబు జీవితమంతా మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లు

నాడు పెట్రోల్, డీజిల్‌పై సర్‌ చార్జ్‌ విధించింది చంద్రబాబు కాదా? 

2019 ఎన్నికల్లో టీడీపీని ప్రజలు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు

పెట్రోల్‌ బంకులపై దాడులు చేసేందుకు చంద్రబాబు నిరసన దీక్ష

పులివెందుల పులి వైయస్‌ జగన్‌ ఎవరికి భయపడడు

చంద్రబాబు, పవన్‌కు ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదు

తాడేపల్లి: చంద్రబాబుకు దమ్ముంటే పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించాలని ఢిల్లీలో ధర్నా చేయాలని మంత్రి కొడాలి నాని సవాలు విసిరారు. పెట్రోల్‌ బంకులపై దాడులు చేసేందుకు చంద్రబాబు నిరసన దీక్ష చేపడుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో టీడీపీని ప్రజలు పెట్రోల్‌ పోసి తగులబెట్టారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాతలు పెట్టి అయింట్‌మెంట్‌ రాస్తుందన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తక్కువుగా ఉన్నా మోదీ అధికారంలోకి వచ్చాక పెట్రోల, డీజిల్‌ ధరలు వంద రూపాయల మార్కును దాటించారన్నారు. లీటర్‌పై రూ.40 పెంచి ఐదు, పది రూపాయలు తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. అలాగైతే రాష్ట్ర ప్రభుత్వం 7 పైసలు తగ్గించాలా అని నిలదీశారు.  తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికలో డిపాజిట్లు రాని బీజేపీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌కు ఢిల్లీలో అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. 

ఇటీవల జరిగిన బద్వేలు ఉప ఎన్నికలో మూడు పార్టీలు కలిసి వైయస్‌ఆర్‌సీపీపై పోటీ చేస్తే..బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి 90 వేల పైచిలుకు మెజారిటీ వచ్చింది. పశ్చిమ బెంగాల్లో 4 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే లక్ష పైగా మెజారిటీతో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట, లేని చోట ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో బీజేపీని పెట్రోల్‌ డీజిల్‌ పోసి తగలబెడతారని గ్రహించిన కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ప్రజలు అమాయకులు, మనం ఏమి చెప్పినా కూడా ఉపన్యాసాలు వింటారని, ఎప్పుడూ మనతోనే ఉంటారనే భ్రమలో, భ్రాంతిలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ధర తగ్గించి, మేమేదో ఘన కార్యం చేశాం. ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకున్నామని అనుకుంటున్నారు. రూ.70 ఉన్న పెట్రోల్‌ ధరను రూ.110లకు పెంచి రూ.5 తగ్గించామని, ప్రజలు కనికరిస్తారన్న పిచ్చి భ్రమలో బీజేపీ నేతలు ఉన్నారు. 

సోము వీర్రాజు, రాష్ట్రంలోని కొంత మంది బీజేపీ నేతలు రోడ్లపైకి వచ్చి..మోదీ రూ.5, రూ.10 తగ్గించారని, మీరేం తగ్గించారని సీఎం వైయస్‌ జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత డీజిల్‌పై పెంచిన ట్యాక్స్‌ ఒక్క రూపాయి మాత్రమే. అది కూడా దుర్మార్గుడు చంద్రబాబు రోడ్లు వేస్తానని చెప్పి రూ.3700 కోట్లు బ్యాంకు నుంచి అప్పు తెచ్చి రోడ్డు వేయకుండా పసుపు, కుంకుమా అంటూ ఓటర్లకు పంచి పెట్టాడు. ఏడాదికి కొంత వాయిదా రూపంలో కడుతానని, పెట్రోల్, డీజిల్‌పై రూ.2 సెస్‌ వేస్తానని చంద్రబాబు అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. చంద్రబాబు కట్టాల్సిన అప్పులు తీర్చేందుకు మా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఒక్క రూపాయి సెస్‌ వేస్తే..మీరేం తగ్గిస్తారని ఈ పనికిమాలిన బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైయస్‌ జగన్‌ తగ్గించిన రూపాయిలో ఎంత తగ్గించాలి, 7 పైసలా, 9పైసలా చెప్పండి?

కేంద్రం పెట్రో ధరలపై పెంచిన రూ.50ల్లో రూ.5,10 రూపాయలు తగ్గిస్తే..మేం ఎంత తగ్గించాలి? మేం 7 పైసలు తగ్గించాలా?. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు పెట్రోల్, డీజిల్‌ పోసి తగులబెడితే అయినా కూడా బుద్ధి రాలేదు. మోదీ ప్రధాని అయిన దేశంలో క్రూడాయిల్‌ ధర వంద కన్న తక్కువగానే ఉంది. ఈ రోజు అంతకన్న తక్కువగానే ఉంది. ఆ రోజు లీటర్‌ పెట్రోల్, డీజిల్‌ రూ.40లకే అమ్మారు. ఈ రోజు క్రూడాయిల్‌ రేట్‌ తగ్గినా కూడా రూ.100 ధరను తీసుకెళ్లిన ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానికే దక్కింది. ఈ రోజు రాష్ట్రాలకు రావాల్సిన ట్యాక్స్‌లు ఎగ్గోట్టడానికి ఎక్సైజ్‌ డ్యూటీ రూ.47 వేల కోట్లు చూపిస్తున్నారు.

రాష్ట్రాలకు మాత్రం రూ.15 వేల కోట్లు మాత్రమే షేర్‌ పంచిపెడుతున్నారు. సర్‌ చార్జ్‌ రూపంలో రూ.74 వేల కోట్లు, మౌలిక వసతులు, రోడ్డు నిర్మాణం అని చెప్పి రూ. 1.98 లక్షల కోట్లు, పెట్రోల్‌ ఉత్పత్తులపై కొత్త పన్నులు అని కనిపెట్టి రూ. 15 వేల కోట్లు..ఇవన్నీ దాదాపు మూడు లక్షల 50 వేల కోట్లు ఏడాదికి పేద ప్రజల నుంచి దోచుకుంటున్న జలగలు బీజేపీ ప్రభుత్వం. రూ.15 వేల కోట్లు వచ్చే దొంగ ఆదాయంలో మేమేదో ఉద్ధరిస్తున్నామని ఐదు, పది రూపాయలు తగ్గించామని గొప్పలు చెప్పుకుంటూ సిగ్గుమాలిన పరిస్థితిలో కేంద్రంలోని బీజేపీ ఉంది.  వాళ్లను నమ్ముకున్న గల్లీ బీజేపీ, సిల్లీ బీజేపీ, తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో జనసేనను కలుపుకున్నా డిపాజిట్‌ రాని ఏపీ బీజేపీ, బద్వేల్‌ ఉప ఎన్నికలో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా డిపాజిట్‌ రాని బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. వీళ్లు చేసిన పాపాలను వైయస్‌ జగన్‌పై మోపాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు.

ప్రజలు అమాయకులు అనుకోవడం మీ అమాయకత్వం. తిరుపతి, బద్వేల్‌ ఉప ఎన్నికల్లో ఎందుకు డిపాజిట్లు రాలేదో ఒక్కసారైనా ఆలోచన చేశారా? దేశాన్ని పాలించే బీజేపీని ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు. కోట్లాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ అని చెప్పుకుంటున్నారు. అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పుకుంటున్నారు. అయినా కూడా ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్‌ ఎన్నికల దాకా మీకు డిపాజిట్లు కూడా రావడం లేదంటే దానికి కారణం మీరు చేసే అరాచకాలే. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని, బ్రహ్మాండంగా పని చేసే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై మీరు ఏదో ఒక రకంగా అబాంఢాలు వేయాలని ప్రతి నిమిషం కూడా ఆలోచించడం వల్లే ప్రజలు మీకు ప్రతి ఎన్నికలోనూ బుద్ధి చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీని కాపాడేందుకు ఆ దేవుడికి కూడా శక్తిసామర్థ్యాలు లేవు.

బీజేపీకి తోక పార్టీ, 40 ఏళ్ల ఇండస్ట్రీ, డీజిల్, పెట్రోల్‌ను తానే కనిపెట్టానని చెప్పుకునే ఒక వృద్ధ జంబూకం అనే చంద్రబాబు ఇక్కడ ఉన్నారు. ఈ రోజు పెట్రోల్‌ బంకుల వద్ద నిరసన దీక్ష చేస్తారట. రాష్ట్రంలో ఏ నిరసన కార్యక్రమం, ధర్నా, బంద్‌ ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లలో, రోడ్లపైన చేయడం ఇప్పటి వరకు చూశాం. కొత్తగా చంద్రబాబు పెట్రోల్‌ బంకుల వద్ద నిరసన చేస్తారట. పెట్రోల్‌ బంకులు ప్రైవేట్‌ ఆస్తులు. ప్రైవేట్‌ ప్రపార్టీల వద్ద చంద్రబాబు నిరసనలు, ధర్నాలు, దాడులు చేయించి రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదని చెప్పడానికే పెట్రోల్‌ బంకుల వద్ద నిరసనలు చేస్తున్నారు. చంద్రబాబుకు వయసు వచ్చింది కానీ బుద్ది రాలేదు.

చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, కుట్రలు, మోసాలు, వెన్నుపోట్లు. చంద్రబాబు సీఎం అయ్యాక 2014లో అమరావతిని అభివృద్ధి చేసేందుకు డీజిల్, పెట్రోల్‌పై రూ.2 సర్‌ చార్జ్‌ వేసిన ఏకైక సీఎం చంద్రబాబు. ఈ రాష్ట్రంలో రెండు రూపాయలు సర్‌ చార్జ్‌ వేసి..నాలుగున్నర సంవత్సరాలు దాన్ని అమలు చేసి రాష్ట్రంలో రూ.10 వేల కోట్లు లూఠీ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఎన్నికలకు మూడు నెలల ముందు ప్రజలు మాడు పగులగొడుతారని భయంతో రెండు రూపాయల సర్‌ చార్జ్‌ తగ్గించి ప్రజల ఛీత్కారానికి గురయ్యారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పెట్రోల్‌ పోసి ఈ దొంగను, సన్యాసిని, వెధవను, నీచుడిని తగులబెట్టారు. ఆ తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఉప ఎన్నికలు, ఇలా ప్రతి ఎన్నికలోనూ ప్రజలు పెట్రోల్, డీజిల్‌ పోసి తగుల బెడుతూనే ఉన్నారు.

ఈ రోజు కొత్తగా రాష్ట్రంలో మళ్లీ 12 చోట్ల మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షానికి ఏమీ లేక..డీజిల్, పెట్రోల్‌ చార్జీలు వైయస్‌ జగన్‌ తగ్గించాలని 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇవాళ బంకుల వద్ద ధర్నాలు చేస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గిస్తాడా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఈ వెధవకు..ప్రధాని తగ్గించాలని తెలియదా? చంద్రబాబుకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్‌ వద్ద నల్ల చొక్కా వేసుకొని ధర్నాలు చేశావు కదా? ఇప్పుడు వెళ్లి అలాంటి నిరసనలు చేయండి. తీరు మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజలు టీడీపీని పెట్రోల్‌ పోసి తగులబెడుతారు. కుప్పంలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో నీవు ఒక లుచ్చాగాడివని చిత్తు చిత్తుగా ఓడిస్తారు. కేసులకు భయపడి కేంద్రాన్ని అడగలేని దద్దమ్మవని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే ప్రతి రూపాయి కూడా పేదల అభ్యున్నతికి వైయస్‌ జగన్‌ ఖర్చు చేస్తున్నారు. పేదల చదువు, వైద్యం, ఇళ్లు సమకూరుస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అందుకే ప్రజలు ఏ ఎన్నిక జరిగినా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా 70, 80 శాతం మంది వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. నీలాంటి వెధవలు, నీ పార్ట్‌నర్‌ పనికిమాలిన పవన్‌ కల్యాణ్‌ కావచ్చు, ఇక్కడున్న గల్లీలో ఉన్న బీజేపీ సిల్లీ నాయకులు ఎంత మంది అవాకులు చవాకులు పేల్చిన, వైయస్‌ జగన్‌ స్థాయిని తగ్గించాలని మీరు ప్రయత్నం చేసినా ప్రజలు రోజు రోజుకు ఒక్కో మెట్టు ఎక్కిస్తూనే ఉన్నారు. మీరు వైయస్‌ జగన్‌ పరిపాలనను చూసి, మాటమీద నిలబెడ తత్వాన్ని చూసి ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటే మీరు కొన్నాళ్లు రాజకీయాల్లో ఉంటారు.

రాష్ట్రంలో జరిగే ప్రతి మంచి కార్యక్రమాన్ని కేంద్రం నిధులతో చేస్తున్నామని చెప్పాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు మీకు గడ్డి పెట్టి బీజేపీకి డిపాజిట్లు రాకుండా, నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు భయపెడితే భయపడటానికి ఇక్కడ మేకలు, నక్కలు లేవు. ఇక్కడ ఉన్నది పులివెందుల పులి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియాగాంధీని ఈకముక్కతో తీసిపారేసిన వ్యక్తి, ఎన్ని కేసులు పెట్టినా 16 నెలలు జైల్లో ఉండి..వెనుకడుగు వేయకుండా ముందుకు సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మగాడు వైయస్‌ జగన్‌. మీ ఉడత ఊపులకు, బెదిరింపులకు బెదిరే వ్యక్తులు ఎవరూ లేరు. ఒళ్లు దగ్గర పెట్టుకొని వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడాలి. గల్లీ బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి ప్రశ్నించాలి. రూ.50 ఉన్న పెట్రోల్, డీజిల్‌ను రూ.100కు అమ్ముకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు.

పీకే..పవన్‌ కల్యాణ్‌ మొన్న వైజాగ్‌కు వెళ్లి ఏదేదో మాట్లాడుతున్నాడు. అక్కడ స్టేజీ మీద ఉన్న వాళ్లే పీకే మాటలకు షాక్‌కు గురయ్యారు. వైయస్‌ జగన్‌కు ఈయన డెడ్‌లైన్‌ పెడతారట. వారం రోజుల్లో అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని ఆయన పెట్టిన డెడ్‌లైన్‌. దానికి వైయస్‌ జగన్‌ ఎందుకు మీ పనికి మాలిన పార్టీల నుంచి ఒక్కొక్కరిని పంపిస్తే నేనే ఫ్లైట్‌లో ఢిల్లీ తీసుకెళ్తా. ఈ రోజు ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కాకుండా ఆపాల్సింది ఎవరండి?. కేంద్రంలో ఉన్న బీజేపీ. వాళ్ల సంక నాకేది పవన్‌ కల్యాణ్‌. పొత్తులో ఇద్దరూ కలిసి పోటీ చేస్తారు. అక్కడికి వెళ్లి అల్టీమేటం ఎవరికి ఇవ్వాలి.

బీజేపీ ప్రైవేట్‌పరం చేస్తే మీతో కలిసి పోటీ చేయమని మోదీకి అల్టీమెటం పెట్టాలి. ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని మోదీకి వార్నింగ్‌కు ఇవ్వకుండా..వారం రోజుల్లో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డెడ్‌లైన్‌ పెడుతున్నాడు. ఎందుకంటే మొన్న మీ పార్టనర్‌ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తే ఇవ్వలేదు. వపన్‌ కూడా ఢిల్లీ వెళ్తే మోదీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ద్వితీయ శ్రేణి లీడర్లను కలవమని చెప్పారు. నీవు చంద్రబాబు రెండేళ్ల నుంచి మోదీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదు. మీకు అపాయింట్‌మెంట్‌ కావాలంటే ఇప్పుడు వైయస్‌ జగన్‌ అవసరమెచ్చింది. స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని ..అఖిలపక్షంలో చంద్రబాబు, పవన్‌ దూరిపోయి రెండు నిమిషాలు స్టీల్‌ ప్లాంట్‌ గురించి మాట్లాడి..అక్కడ మోదీని ఈ ఇద్దరు చేరో కాలు పట్టుకుని కూర్చుంటారు. పర్సనల్‌గా మాట్లాడాలని అడుక్కోని మోదీతో పొత్తుకు ప్రయత్నించడానికి సిగ్గులేకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. జనం పిచ్చోళ్లు, మేం పిచ్చొళ్లమా?. మీకు మోదీ అపాయింట్‌మెంట్‌ కావాలంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని ఢిల్లీలో మోకాళ్లపై కూర్చుంటే దొరుకుతుంది. మీరు చేసే లుచ్చా పనుల కోసం వైయస్‌ జగన్‌ అఖిలపక్షం వేసి మిమ్మల్ని ప్రధాని వద్దకు ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకెళ్లరు.

వారం రోజులు కాదు..ఏడేళ్లు డెడ్‌లైన్‌ పెట్టినా వైయస్‌ జగన్‌ మిమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్లడు. ఏం పిక్కుంటావో పిక్కో..డెడ్‌లైన్లు పెట్టవద్దు. నీవు చెప్పినట్లు వైయస్‌ జగన్‌ చేయరు. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయాలో ఆయనకే తెలుసు. ఈ రోజు ఒరిస్సాకు వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు సమస్యలు ఉన్నాయి. నీటి సమస్యలు ఉన్నాయి. ఎప్పుడైనా చంద్రబాబు ఏ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. చంద్రబాబుకు రాజకీయ అవసరాలు ఉంటే సోనియా ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకుంటాడు. రాహుల్‌ గాంధీ సంక నాకుతాడు. మోదీ వద్దకువెళ్లి సంక నాకుతాడు. దేశంలోని ప్రతి రాజకీయ నాయకుడి గుమ్మాన్ని చంద్రబాబు తొక్కాడు. చంద్రబాబు సీఎం అయ్యేందుకు ఎవరి కాళ్లైనా పట్టుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏ సీఎంను కలవలేదు. 

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే తెలంగాణకు, మనకు మధ్య ఉన్న అంశాలపై కేసీఆర్‌తో రెండుసార్లు కలిశారు. ఈ రోజు ఉత్తరాంధ్రలోని మారుమూల 21 గ్రామాల సమస్యపై చర్చించేందుకు వైయస్‌ జగన్‌ ఒరిస్సాకు వెళ్తున్నారు. అక్కడి సీఎం నవీన్‌ పట్నాయక్‌ను కలిసేందుకు ఈ రోజు వైయస్‌ జగన్‌ ఒరిస్సా వెళ్తున్నారు. 21 చిన్న గ్రామాల గురించి ఒరిస్సా వెళ్లి సీఎంతో చర్చలు జరుపుతున్నారంటే..ఈ రాష్ట్రంలోని పౌరులపై వైయస్‌ జగన్‌కు ఉన్న మమకారం తెలుస్తుంది. కేంద్రంలో చక్రాలు తిప్పాను, బొంగరాలు తిప్పానని చెప్పుకునే సొల్లు వెధవ ఎందుకు ఇన్నాళ్లు ఈ 21 గ్రామాల గురించి ఆలోచించలేదు. ఇలాంటి వెధవను ఎన్టీ రామారావు అల్లుడిగా చేసుకోవడం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఎన్టీఆర్‌ దురదృష్టం కాబట్టే ఆయన్ను వెన్నుపోటు పొడిచాడు. తెలుగు ప్రజల కోసం టీడీపీని స్థాపిస్తే..చంద్రబాబు దోచుకున్నారు. రేపు జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించి రాజకీయ సమాది చేయాలని మంత్రి కోడాలి నాని ఓటర్లను అభ్యర్థించారు.

 

 

తాజా ఫోటోలు

Back to Top