వైయ‌స్ జ‌గ‌న్‌ను ఎదుర్కొనే నాయ‌కుడు ఈ రాష్ట్రంలో లేడు

 పవన్ ప్రత్యకంగా జనసేన అనే పార్టీని స్దాపించడమెందుకు ?..టీడీపీలో చేర‌మ‌నండి

 మంత్రి కొడాలి నాని 

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఎదుర్కొనే నాయ‌కుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో లేడ‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.  ఎంత‌మంది క‌లిసొచ్చినా వైయ‌స్ జ‌గ‌న్‌ని ఢీకొన‌లేరు. బ‌తికున్నంత‌కాలం రాష్ట్రానికి వైయ‌స్ జ‌గ‌నే సీఎంగా ఉంటార‌న్నారు. 160 సీట్ల‌లో సొంతంగా పోటీ చేసే ద‌మ్ము రాష్ట్రంలో ఏ రాజ‌కీయ పార్టీకీ లేద‌న్నారు.  చెరి సగం సీట్లు పంచుకొని పోటీ చేయాలే త‌ప్ప‌.. సొంతంగా అన్ని స్థానాల్లో పోటీ చేసే ద‌మ్ము రాష్ట్ర‌లో వైయ‌స్ఆర్‌సీపీకి మాత్ర‌మే ఉంద‌న్నారు. - చంద్ర‌బాబును సీఎం చేయ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాన్ పార్టీ పెట్ట‌డం దేనికి.. ఆయన పార్టీలోనే చేరి టీడీపీ కోసం క‌ష్ట‌ప‌డితే బాగుంటుంద‌ని ఎద్దేవా చేశారు.  జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలపై టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 
సహజ మరణాలను మద్యం మరణాలుగా చిత్రీకరించేందుకు యత్నం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. శవాలపై చిల్లర ఏరుకునే నీచ  రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తుంద‌న్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మూడో తేదీన చనిపోతే ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని త‌ప్పుప‌ట్టారు. వైయ‌స్ జ‌గ‌న్ పై బురద జల్లాలని 420 బ్యాచ్ ప్రయత్నిస్తోందన్నారు. అసెంబ్లీపై చంద్రబాబుకు ఓ విధానం, లోకేష్‌కు ఓ విధానం ఉంద‌ని విమ‌ర్శించారు.  నోటికి వ‌చ్చిన‌ట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమ‌ని మంత్రి కొడాలి నాని హెచ్చ‌రించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top