సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు దేవుని ఆశీస్సులు ఉండాలి

మంత్రి కొడాలి నాని

శ్రీవారిని దర్శించుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

 
తిరుమల: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కిదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని మంత్రి కొడాలి నాని తెలిపారు. శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అబ్దుల్ హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి త‌దిత‌రులు ఉదయం విఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ. కోవిడ్ కారణంగా దేశం, ప్రపంచంలో అనేక  వ్యవస్థలు‌ కుప్పకూలి ఆర్థికంగా చితికి పోయాయన్నారు. కరోనా నుండి త్వరగా కోలుకోవాలని స్వామి వారిని కోరుకున్న‌ట్లు చెప్పారు.
 
మంచి వ‌ర్షాలు కురిసి..
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి త్వరగా నాశనం అయి.. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. మంచి వర్షాలు కురిసి రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మంత్రివర్గ విస్తరణ.. ముఖ్యమంత్రి నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ కి ఇంకా సమయం ఉందని కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు.
 

Back to Top