చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌

బుద్ధి లేకుండా జోలెపట్టుకొని పిచ్చికుక్కలా తిరుగుతున్నాడు

మూడు రాజధానులకు ప్రజలంతా మద్దతిస్తున్నారు

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలంతా స్వాగతిస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. సచివాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి మాటలకే అభివృద్ధి వికేంద్రీకరణ పరిమితమైందని, కొంతమంది నాయకులు మాటలు చెప్పి ఓట్లు దండుకొని వెనుకబడిన ప్రాంతాలను ఇంకా వెనక్కు నెట్టారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలనను వికేంద్రీకరించాలని, హైకోర్టును రాయలసీమకు, సెక్రటేరియట్‌ను విశాఖకు, అసెంబ్లీ అమరావతిలో ఉండాలని మూడు ప్రాంతాలను సమానదృష్టితో చూసి అభివృద్ధి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.

చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ అని, ఆయన చేసిన తప్పులను రాష్ట్ర ప్రజలు గమనించి ఓడించి ఇంటికి పంపించినా ఇంకా బాబుకు బుద్ధి రాలేదన్నారు. 33 వేల ఎకరాలు తీసుకొని అద్బుతమైన నగరాలు నిర్మిస్తానని సొల్లు కబుర్లు చెప్పి రైతులను, రాష్ట్ర ప్రజలను మోసం చేశాడన్నారు. అందుకే మంగళగిరిలో లోకేష్‌ను కూడా ఓడించారన్నారు. చంద్రబాబు ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా మాట్లాడుతున్నాడని,  చంద్రబాబు రోడ్ల వెంబడి తిరుగుతూ జోలె పట్టుకొని పిచ్చికుక్కలా తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా చంద్రబాబుకు బుద్ధి రాలేదన్నారు. అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకునే నిర్ణయానికి శాసనసభ్యులంతా మద్దతు తెలుపుతారని మంత్రి కొడాలి నాని అన్నారు. 

   
Back to Top