వైయస్‌ జగన్‌ ప్రజలను నమ్ముకున్న ప్రజానేత 

మీలాంటి వ్యక్తుల వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ పట్టలేదు

చంద్రబాబు హైæదరాబాద్‌లో దాక్కుని అంతా అపరేట్‌ చేస్తున్నారు

శవ రాజకీయాలు చేయడంతో చంద్రబాబు పేటెంట్‌ పొందారు

వెన్నుపోటు ఎలా పొడవచ్చో చంద్రబాబు దగ్గర నేర్చుకోవచ్చు

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న చరిత్ర చంద్రబాబుది 

కృష్ణా జిలాలో తీసేసిన తహశీల్దార్‌ దేవినేని ఉమ

కరోనా నియంత్రణపై సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి రోజు సమీక్షిస్తున్నారు

చంద్రబాబులా వైయస్‌ జగన్‌కు పబ్లిసిటీ పిచ్చి లేదు

రమేష్‌కుమార్‌ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎస్‌ఈసీగా కనగరాజ్‌ను నియమించాం

ఈ నెల 16వ తేదీ నుంచి రెండో విడత రేషన్‌ పంపిణీ 

పౌరసరఫరాల శాఖ నేరుగా గ్రామాల్లోనే ధాన్యాన్ని సేకరిస్తుంది

మంత్రి కొడాలి నాని

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలను నమ్ముకున్నారని, అలాంటి వ్యక్తికి లుచ్చాగాళ్ల వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ప్రజలను నమ్ముకొని పార్టీ పెట్టిన వ్యక్తి,  ప్రజల ఆధారాభిమానాలతో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అన్నారు.  ఏ సన్యాసులు, వెన్నుపోటుదారుల వద్ద, పదవుల కోసం అన్నా వదినలను చంపే నీచులు, నికృష్టుల వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ వైయస్‌ జగన్‌కు, ఆయన వద్ద పని చేసే మాకు పట్టలేదని కొడాలి నాని స్పష్టం చేశారు. విజయవాడలో సోమవారం నాని మీడియాతో మాట్లాడారు.

ఏపీలో శవాలను చూస్తే చంద్రబాబుకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.  శవరాజకీయాలు చేయడంలో చంద్రబాబు పేటెంట్‌ హక్కులు పొందారు. హైదరాబాద్‌లో దాక్కుని అద్దాల మేడ నుంచి ఇక్కడ ఆపరేట్‌ చేస్తున్నారు. ఇక్కడ కొంత మంది వ్యక్తులు సీఎం గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వంపై, అదికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మాపై టీడీపీ నేతలు అవాక్కులు, చవాక్కులు పేల్చుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నిన్న కృష్ణా జిల్లాలో తీసేసిన తహశీల్దార్‌ ఒకరు ఉన్నారు. దేవినేని ఉమా ఇరిగేషన్‌ మంత్రిగా పని చేసి 2018లో పోలవరం కడుతా ..రాసిపెట్టుకో, గ్రావిటీతో నీళ్లు  ఇస్తాం, ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అప్పట్లో ఈ ముండా సోల్లు కబుర్లు చెప్పి..నిన్న మళ్లీ ప్రెస్‌ ముందుకు వచ్చారు. కొడాలి నాని 8వ తరగతి చదివారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఇంటర్‌ మీడియట్‌ చదివారని, ఇంకో మంత్రి మూడో తరగతి చదివారని, ఇంకో మంత్రి ఐదో తరగతి చదివాడని మా విద్యార్హతల గురించి చెప్పాడు. ఈ రోజు నేను ఒక్కటే అడుగుతున్నా..ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్లనాని ఎక్కడైనా ఫెయిల్‌ అయితే చెప్పండి. రాష్ట్రంలో కరోనా టెస్టులు సకాలంలో చేయలేక వెనుకబడామా?. పరిస్థితులు తలకిందులు అయ్యాయంటే ఆ మంత్రి ఫెయిల్‌ అయినట్లు.

 కోవిడ్‌–19ని కంట్రోల్‌ చేయడంలో దేశంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని నిన్ననే ఢిల్లీ పెద్దలు చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌ కరోనాపై నిత్యం సమీక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులతో కమిటీలు వేసి జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ప్రతి రోజు సీఎం వైయస్‌ జగన్‌ ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎంత ఎక్కువ మందికి పరీక్షలు చేయగలం. రెడ్‌ జోన్‌ పరిధిలో ప్రజలను బయటకు రానివ్వకుండా నిత్యావసర వస్తువుల దగ్గరి నుంచి ప్రతిది మనమే డోర్‌ డెలివరీ చేయాలని సీఎం ఆదేశిస్తున్నారు. ఒకపక్క రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభలకుండా, వేరే వ్యక్తుల నుంచి వైరస్‌ సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు నేలపాలు అవుతున్నాయి. పరిశ్రమలు రన్నింగ్‌లో లేక కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. అక్వా రంగంలోని రైతుల ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి వెసులుబాటు కల్పించేందుకు జోనల్‌ వ్యవస్థను తీసుకువస్తున్నారు. అర్బన్‌ ఏరియాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. రూరల్‌ ఏరియాల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. అక్కడి రైతులకు వెసులుబాటు కల్పించేందుకు గ్రీన్‌ జోన్లుగా మార్చాలని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రంలోని ఇబ్బందులను ఆయన భావాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని సీఎం వైయస్‌ జగన్‌ చెబితే..సీఎం సొంత కంపెనీ కోసం ఇలాంటి ఆలోచన చేసినట్లు రాష్ట్రంలోని పనికిరాని సవట, సన్యాసులు, ప్రజల చేత తిరస్కరించబడిన అనామకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నుంచి మేం నేర్చుకోవాలని దేవినేని ఉమా చెబుతున్నారు. చంద్రబాబు వద్ద..నీ వద్ద ఏం నేర్చుకోవాలి.

రాష్ట్రంలో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన వ్యక్తిని ఎలా వెన్నుపోటు పొడవాలో నేర్చుకోవాలా?. పార్టీని, ముఖ్యమంత్రి పదవిని ఎలా లాక్కోవాలో నేర్చుకోవాలా?. ఇలాంటి దొంగ పనులు చంద్రబాబు వద్ద నేర్చుకోవాలా ఉమా?. ఎమ్మెల్యే పదవి కోసం అన్న చనిపోతే వదినను బాత్‌రూమ్‌లో ఎలా ఉరి వేయాలో, ఎలా చంపాలో నీ వద్ద నేర్చుకోవాలా ఉమా?. వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి మొట్ట మొదటి ఎన్నికల్లో 67 సీట్లతో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై, రెండో సారి జరిగిన ఎన్నికల్లో  151 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైయస్‌ జగన్‌. ప్రజలను నమ్ముకొని వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారు. ప్రజలను నమ్ముకొని పార్టీ పెట్టిన వ్యక్తి. ప్రజల ఆధారాభిమానాలతో ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి వైయస్‌ జగన్‌. వైయస్‌ జగన్‌ ఏ లుచ్చాగాడి వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏ సన్యాసులు, వెన్నుపోటుదారుల వద్ద, పదవుల కోసం అన్నావదినలను చంపే నీచులు, నికృష్టుల వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ వైయస్‌ జగన్‌కు, ఆయన వద్ద పని చేసే మాకు పట్టలేదు. ప్రజలకు ఏది అవసరమో  అదే చేసే ప్రభుత్వం మాది. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి


వైయస్‌ జగన్‌ ప్రెస్‌ముందు వచ్చి మాట్లాడరట. చంద్రబాబు, దేవినేని ఉమా నిత్యం ప్రెస్‌ గొట్టాల వద్ద జొల్లు కార్చుకుంటుంటారు. ఈ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే ఆయన, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడికి ఒక ప్లాస్టిక్‌ గౌన్‌ వేసుకొని డాక్టర్‌ వద్దకు వెళ్లి కరోనాను ఎలా కంట్రోల్‌ చేయాలో అంటూ డ్రామాలు చేసేవారు. వీరు చేసే డ్రామాలను డబ్బా చానల్స్‌లో చూపిస్తారు. మమతా బెనార్జీ చంద్రబాబుకు ఫోన్‌ చేసి కరోనాను ఎలా కంట్రోల్‌ చేయాలని అడిగితే..ఈయన ఆవిడతో చెబుతున్నట్లు ఒక ఫోటో. మహారాష్ట్ర సీఎం చంద్రబాబుకు ఫోన్‌ చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ ఎలా కొట్టాలంటే..ఆయనకు సలహాలు ఇస్తున్న చంద్రబాబు అంటూ న్యూస్‌. వీళ్లు అధికారంలో ఉంటే ప్లాస్టిక్‌ గౌన్లు వేసుకొని కరోనా వైరస్‌తో పాటు రాష్ట్ర ప్రజలుకు నిద్రాహారాలు లేకుండా చేసేవాళ్లు. వైయస్‌ జగన్‌కు మీ మాదిరిగా పబ్లిసిటీ పిచ్చి లేదు. వైయస్‌జగన్‌ ప్రజలను నమ్ముకున్నారు. టీవీ గొట్టాలను, చానల్స్‌ను కాదు. ఎన్ని గొట్టాలు వ్యతిరేకంగా చూపించినా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చూపిన దారిలో నడిచారు కాబట్టి వైయస్‌ జగన్‌ ఉన్నతమైన స్థానంలోకి వచ్చారు. మీరు ఇలాంటి ఛీప్‌ ట్రిక్స్‌ పబ్లిసిటీతో, ఇలాంటి గొట్టాలను నమ్ముకొని పరిపాలన చేశారు కాబట్టి ఈ రోజు 23 సీట్లకు పరిమితమై దిక్కుమాలిన వాళ్ల మాదిరిగా ఇవాళ రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే హైదరాబాద్‌లో దాక్కొని ఇవాళ ఒక అనాధలాగా పడి ఉండేలాగా ఈ రాష్ట్ర ప్రజలు నీకు పట్టించారు. ఇప్పటికైనా  నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. సలహాలు చెప్పమంటే పనికిమాలిన లేఖలు రాస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇవ్వమంటున్నారు. గడిచిన ఐదేళ్లలో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేసి, కార్పోరేషన్‌ డబ్బులు కూడా పసుపు–కుంకుమ పేరుతో అడ్డమైన కార్యక్రమాలకు ఖర్చు చేశావు. రూ.60 వేల కోట్లు కాంట్రాక్టులకు అçప్పులు ఎగ్గొట్టావు. సిగ్గులేకుండా మళ్లి మాట్లాడుతున్నావు. ఇవాళ ఒకరు విజయవాడలో విగ్గు పెట్టుకొని నిరాహారదీక్ష చేస్తున్నారు. ఎంత విపత్తు వచ్చిన టక్కు, విగ్గు తీయడు. వీళ్లు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తారని ప్రజలు అనుకోవడం లేదు. 
దేవినేని ఉమా ..నీకు నోరుంది. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీవు ఎక్కడో ఒకచోట కనబకపోవు. అప్పుడు నీకు తగిన బుద్ధి చెబుతా..నీకు మూతిపళ్లు పగులగొట్టించుకునే రోజు దగ్గర్లోనే ఉంది. నీకు అసలే గొంతు బాగోలేదు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రెండు మాటలు మాట్లాడితే మూడో మాట అర్థం కాదు. కొడితే నీ మూతి సేపులు కూడా మారిపోతాయి. సీఎం గురించి మరోసారి ఎక్కడైనా మాట్లాడితే, ఏకవచనంతో సంభోదిస్తే..పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్లు నా చెవులకు వినబడితే నీ మూతి సేపులు మారేలా పగులగొడుతా అంటూ కొడాలి నాని హెచ్చరించారు. 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఎన్నికల కమిషనర్‌ను మార్చకూడదంటున్నారు. వీళ్లు మాత్రం కోర్టుల్లో ఐదారు పిటీషన్లు వేసి కరోనా ఉన్నా కూడా కోర్టుకు వెళ్లి వాధించవచ్చు. వీళ్లకు కోర్టుకు వెళ్లేందుకు కరోనా వైరస్‌ అడ్డం కాదు. ప్రభుత్వం ఏదైన పని చేస్తుంటే కరోనా అడ్డం అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పెట్టమని ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తే..రమేష్‌కుమార్‌ ఏం చేశారు?. ఫలాని సమయంలో పోలీసులు, ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటారని రిజర్వేషన్లు ఖరారు చేసి, పోలింగ్‌ బూతులు సిద్దం చేస్తే బాగుంటుందని మా డీజీపీ, సీఎస్‌ వెళ్లి ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. ఆయన జాగీరులాగా కనీసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారు. చంద్రబాబుతో చర్చించి ఎన్నికలు వాయిదా వేశారు. అయినా కూడా క్షమించి వదిలేస్తే..మొన్న చంద్రబాబు 250 ఫోటోలు పెట్టారంటా?..ఈ ఫోటోలు అధికారులకు పంపించి ..రూ.1000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే మంత్రి కొడాలి నాని ఫోటో దిగారని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. సహాయ కార్యక్రమాల్లో మా పార్టీ వ్యక్తులు ఉంటారు. చర్యలు తీసుకోవాలని చెప్పే అధికారం ఆయనకెక్కడిది?. ఎన్నికల కోడ్‌ ఆగిపోయింది కాబట్టి నీకు సంబంధం లేదు.

రమేష్‌ కుమార్‌ అనే వ్యక్తి చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ. ఏబీ వెంకటేశ్వరరావు కూడా బాబు చేతిలో కీలు బొమ్మనే. చంద్రబాబు ఇటువంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్‌ చేస్తారు. చంద్రబాబు ఉచ్చులో పడి కొట్టుకునే వ్యక్తులకు ఇదే జరుగుతుంది. రమేష్‌కుమార్‌ మళ్లీ ఎన్నికల కమిషన్‌ అయితే ఏం చేస్తారు. ఇలాంటి వ్యక్తులున్నంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదు. అందుకే ఇతన్ని తీసేసి హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమించాం. రిటైర్డ్‌ జడ్జి రాజకీయ నేతల కింద పని చేయడు. ఈయన పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఏ కులంతోనో, ఏ మతంతోనూ సంబంధం లేని వ్యక్తి కాబట్టి అందరికి న్యాయం చేస్తారని కనగరాజ్‌ను నియమించాం.

చంద్రబాబు తన కింద పని చేసిన వ్యక్తిని, కాలు కింద చెప్పును తీసుకువచ్చి ఎన్నికల కమిషనర్‌గా చేస్తే అది న్యాయమట.  కనగరాజ్‌కు మతం రంగు పులుముతున్నారు. కొంతమంది వేధవలు ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు. దాన్ని కొన్ని టీవీల్లో చూపిస్తూ ఆయన ఏసుక్రీస్తు భక్తుడు, ఈయన వెంకటేశ్వరస్వామి భక్తుడు అంటున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ఎవరితో సంబంధం లేని వ్యక్తిని ఎస్‌ఈసీ స్థానంలో పెడితే బాగుంటుందని వైయస్‌ జగన్‌ ఆలోచన చేసి పక్క రాష్ట్రం నుంచి తెచ్చారు. ఎన్నికల కమిషనర్‌ ఎవరైనా భయపడేది లేదు. రమేష్‌కుమార్‌ ఈ రాష్ట్రం నుంచి పారిపోయారు. ఆయన మళ్లీ కమిషనర్‌ అయితే మేం భయపడుతామా? ఇలాంటి సన్యాసులు చెప్పే మాటలు విని ఈ రాష్ట్ర ప్రజలు భయపడొద్దు. సీఎం వైయస్‌ జగన్‌కు కులం, మతం లేదు. ప్రజలకు సేవ చేసేందుకు, మెరుగైన సమాజం కోసం పని చేస్తున్నారు. చనిపోయిన తరువాత ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రతి ఇంట్లో వైయస్‌ఆర్‌ ఫోటో పక్కన తన బొమ్మ ఉండాలని తపనతో పని చేసే వ్యక్తి వైయస్‌ జగన్‌. అలాంటి వ్యక్తిపై నిందలు వేసి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే  ఎవరైనా సరే సహించేది లేదు. వెంకటేశ్వరరావు ఐదేళ్లు మా ఎమ్మెల్యేలతో బేరాలు ఆడారు. నాతో కూడా మాట్లాడారు. ఇలాంటి వ్యక్తులకు మేం భయపడేది లేదు. టీడీపీని ఈసారి మూడుసీట్లకు పరిమితం చేసి చంద్రబాబు పార్టీని భూస్థాపితం చేయాలని ప్రజలకు కొడాలి నాని పిలుపునిచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం రమేష్‌కుమార్‌కు కుక్కకాటుకు చెప్పుదెబ్బగా ఉందని అభివర్ణించారు. ఏ అధికారి అయినా ఇండిపెండెంట్‌గా పని చేయాలని, కొంత మంది వ్యక్తులకు, కులాలకు, గురువుల కనుసన్నాల్లో మెలుగుతామంటే ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. 

16వ తేదీ నుంచి రెండో విడత రేషన్‌..
ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో రెండో విడత రేషన్‌ పంపిణీ చేస్తున్నామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.  రెండో విడతలో ఐదు కేజీల బియ్యం, కేజీ శనగలు ఇస్తాం. 14 వేల రేషన్‌ షాపులకు అదనపు కౌంటర్లు పెడుతున్నాం. రేషన్‌ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నాం. వాలంటీర్ల ద్వారా రేషన్‌కార్డుదారులందరికీ కూపంన్లు పంపిణీ చేస్తాం. కూపన్ల మీద ఉన్న తేదీల్లో మాత్రమే రేషన్‌ షాపుల వద్దకు రావాలి. గ్రామ సచివాలయాల్లో రైతులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. పౌరసరఫరాల శాఖ నేరుగా గ్రామాల్లోనే ధాన్యాన్ని సేకరిస్తుంది. 

 

తాజా వీడియోలు

Back to Top