చంద్రబాబు కుయుక్తులను తిప్పికొట్టాలి

మంత్రి కొడాలి నాని

గుడివాడ‌: ప్రజల కష్టాలను తీర్చడం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని   మంత్రి కొడాలి నాని అన్నారు. పేదల కోసం తాము ఎంతో చేస్తుంటే... అడ్డుకోవడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు కుయుక్తులను తిప్పికొట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో నూతన మార్కెట్ యార్డ్ కార్యవర్గం ఈ రోజు ప్రమాణస్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి కొడాలి నాని, పేర్ని నానిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ..గల్లీ నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు తన మనుషులను పెట్టుకుని సీఎం వైయ‌స్ జగన్ చేస్తున్న మంచి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరెన్ని కుట్రలకు పాల్పడినా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top