నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తాం

పైలెట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో ప్రారంభిస్తాం

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

 

అమరావతి: ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. నాణ్యమైన బియ్యం పంపిణీ పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని, ప్రస్తుతం గోడౌన్లలో ఉన్న బియ్యం నాసిరకంగా ఉన్నాయన్నారు. గతంలో ఇచ్చిన రేషన్‌ బియ్యం ప్రజలు తినడానికి అనుగుణంగా లేవన్నారు. గత ప్రభుత్వం పౌరసరఫరాల వ్యవస్థను నాశనం చేసిందని, మిల్లర్లకు రూ. 1200 కోట్ల బకాయిలు పెట్టిందన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లలో కొత్త ధాన్యాన్ని సేకరిస్తామని, సమస్యలను అధిగమించి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తాం.

తాజా వీడియోలు

Back to Top