పశ్చిమ గోదావరి జిల్లా: వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ చేద్దామని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదారమ్మకు చంద్రబాబు అంటే ఎందుకో ఆగ్రహం అంటూ ఎద్దేవా చేశారు. ‘‘పుష్కరాల్లో బాబు లెగ్ పెట్టాడు. 29 మందిని పొట్టన పెట్టుకొన్నాడు. నిన్న కూడా గోదావరి జిల్లాల్లో అడుగు పెట్టాడు. పడవ ప్రమాదం జరిగింది. గోదారమ్మ దయతో శాంతించింది కాబట్టి టీడీపీ నేతలు బతికి బయట పడ్డారు. సీఎం వైయస్ జగన్ పాలనలో గోదావరి ప్రాంత ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. వరదలు సంభవించినప్పటి నుంచి సీఎం వైయస్ జగన్, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంతా ప్రజలతోనే ఉన్నాం. ప్రజలు మంచి కోసం ఆలోచించే వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని మంత్రి అన్నారు.