రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు

మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. శ‌నివారం తణుకు మినిస్టర్‌ క్యాంపు కార్యాలయంలో కారుమూరి మీడియా సమావేశంలో మాట్లాడారు.  చంద్ర‌బాబుకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వ‌జ‌మెత్తారు. ఆనాడు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంది బాబే.  హోదా అంశాన్ని అటకెక్కించిన వ్య‌క్తి చంద్ర‌బాబు అంటూ దుయ్య‌బ‌ట్టారు. పోలవరం పూర్తికాని పాపం కూడా బాబుదే అన్నారు. 
పోలవరంలో ఏమీ చేయకుండా అంతా చేసేశానంటూ బాబు బిల్డప్ ఇచ్చార‌ని త‌ప్పుప‌ట్టారు. మనుషుల్ని తీసుకెళ్లి మరీ భజన చేయించుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ ఊసెత్తే అర్హత బాబుకి లేద‌న్నారు. మా ప్రభుత్వంలో సచివాలయం రూపేణా లక్షల్లో ఉద్యోగాలిచ్చామ‌ని మంత్రి వెల్ల‌డించారు. చంద్రబాబు హయంలో 11.8 శాతం పేదరికం ఉంటే, పేదరికాన్ని 6 శాతానికి తగ్గించిన  ఘనత వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిదని వివ‌రించారు. బాబు హయాంలో 17వ స్థానంలో విద్యావ్యవస్థ 
జగనన్న విప్లవాత్మక మార్పులతో ఇప్పుడు మూడో స్థానంలో ఉంద‌న్నారు. రెండకరాల రైతువి.. లక్ష కోట్లు ఎలా సంపాదించావని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు ప్ర‌శ్నించారు.  

Back to Top