చంద్రబాబువి అబ్రకదబ్ర హామీలు

వైయ‌స్ జగన్ పాలనలో రైతులకు అత్యంత మేలు జరుగుతోంది

ఆర్బీకేల ద్వారానే ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నాం

ప్రభుత్వంపై బురద చల్లడానికి ఈనాడు అసత్య కథనాలు రాస్తోంది

ప్రతి రైతు దగ్గరా ధాన్యం కొనుగోలు చేశాం

రైతులకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసినా రామోజీకి కనపడదు, వినపడదు

చంద్రబాబు హయాంలో 2.65 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు

నాలుగేళ్ల వైయ‌స్‌ జగన్ పాల‌న‌లో 3.10 కోట్ల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు 

2014-19లో 17.94 లక్షల రైతులకు రూ.40,236 కోట్లు మాత్రమే చెల్లింపులు

నాలుగేళ్లలో వైయ‌స్‌ జగన్ 32.78 లక్షల రైతులకు రూ.58,765 కోట్లు చెల్లింపులు 

పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు

తాడేపల్లి: ధాన్యం కొనుగోళ్ల‌పై ఈనాడు రామోజీ త‌ప్పుడు రాత‌లు రాస్తున్నాడ‌ని, చంద్ర‌బాబు హ‌యాంలో కంటే వైయ‌స్ జ‌గ‌న్ నాలుగేళ్ల పాల‌న‌లోనే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశార‌ని, ఆర్బీకే వ్య‌వ‌స్థ ద్వారా రైతు పండించిన ప్ర‌తి ధాన్యం గింజ‌ను గిట్టుబాటు ధ‌ర‌కు కొనుగోలు చేశామ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఈనాడు రామోజీరావు నిత్యం విషం చిమ్ముతున్నాడ‌ని, వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వంపై ఎందుకింత క‌క్ష అని ప్ర‌శ్నించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మంత్రి కారుమూరి ఇంకా ఏమన్నారంటే..
ఈనాడు దినపత్రికలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు దగా అని రాశారు. రైతులకు మేలు జరగాలని సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ఏ ఏడాదికి ఆ ఏడాదే పథకాలు అందజేస్తున్నారు. మా శాఖ ద్వారా, మా చేత సేవలు చేయిస్తున్నారు. రాష్ట్రంలో దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. మిల్లర్లకు, రైతుకు సంబంధం లేకుండా..ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని పంపించి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. ఈ విషయంలో విజయవంతం అయ్యాం. ఈ విధానంతో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. 

గత ఐదేళ్లలో (చంద్రబాబు హయాంలో) రైతుల దగ్గర నుంచి 17.94 లక్షల రైతుల నుంచి 2.65 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి రూ.40,236 కోట్లు చెల్లింపులు చేశారు. నాలుగేళ్లలో సీఎం వైయ‌స్ జగన్ 32.78 లక్షల రైతుల నుంచి 3.10 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 58,765 కోట్లు చెల్లింపులు చేశాం.

ఇవాళ ఈనాడులో రామోజీరావు బాధ వర్ణణాతీతం. ఆయన దేని గురించి బాధపడుతున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ నాడు-నేడు అని రైతులకు ఎంత మేలు జరిగిందో పెట్టాం. అది చూస్తే ఎంత మేలు చేశామో అర్థమౌతుంది. రైతులకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసినా, గిట్టుబాటు ధర కల్పించికపోయినా ఏనాడూ రామోజీరావు, దత్తపుత్రుడు మాట్లాడరు. 

చంద్రబాబు ఎంత దుర్మార్గం చేశారో.. రైతులకు తెల్సు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. 2014 ఇన్‌పుట్ సబ్సిడీ కూడా సీఎం వైయ‌స్‌ జగన్ వచ్చాకే ఇచ్చారు. ఇప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్‌స్యూరెన్స్‌లు ఆ పంట కాలంలోనే ఇస్తున్నాం. 

తెలంగాణలో పండించిన ధాన్యాన్ని ఎవ్వరూ కొనరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణ రకం, ఇతర అన్ని రకాలు ధాన్యాలు పండిస్తారు. మన దగ్గర పండే ధాన్యాన్ని రైతుల నుంచి ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధరకు బయ్యర్లు కొనుగోలు చేస్తారు. 

ఐదేళ్ల నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయని కేంద్ర ప్రభుత్వం.. కొనిపించే ఏర్పాట్లు చేశాం. బోండాలను కొనుగోలు చేయాలనుకుంటే కొంత మాత్రమే వచ్చింది. అమ్మండని రైతులను కోరినా అమ్మలేదు. కేరళ అడిగిన బోండాలు రకం కూడా కొనుగోలు చేశాం. కేరళలో ఓనమ్ పండగ వరకు మన రైతులు నిల్వ చేస్తారు. అలా నిల్వ చేయటం వల్ల ఎంఎస్‌పీ కంటే.. రూ.1900లకు అమ్మటంతో రైతులకు ఎంతో లాభం వచ్చింది. 

ఇటీవల ధాన్యం ఎగుమతులపై కేంద్రం పన్నులు వేయటంతో కొనుగోలు చేయకపోవచ్చు. అయినా, రైతుల దగ్గర నుంచి ఆఖరి గింజ వరకు కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నాం. ఇవాళ రైతులందరికీ సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి మేలు చేస్తుంటే.. రైతులకు దగా అని రాయటానికి రామోజీరావుకు మనస్సు ఎలా వచ్చింది. రామోజీరావు ఎలాంటి వారో ఆయన తోడల్లుడును అడిగినా చెబుతారు. 

వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఎంఎస్‌పీ రూ.1530 ధర ఇప్పించాం. అదే చంద్రబాబు హయాంలో అయితే.. బాతులు, కోళ్లకు వేయాలని రూ.800లకే కొనుగోలు చేసేవారు. చంద్రబాబు హయాంలో రామోజీరావు ఎక్కడ ఉన్నారు? తెలుగుదేశం వారు దళారీలుగా ఏం దోచుకున్నా..  గాదె కింద పందికొక్కులా.. దోచుకున్నా, పచ్చగడ్డిలా మేసేసినా, దోచుకున్నా.. రామోజీరావుకు కనపడదు. వినపడదు. కనపడినా రాయరు. దుర్మార్గంతో, కుళ్లు, ద్వేషంతో ఏదో ఒకరకమైన బురద పడేస్తే కడుక్కుంటారని అనుకుంటున్నారు. లెక్కలు తెలుసుకుని మాట్లాడండి. 

చంద్రబాబు వెన్నుపోట్లు పొడిచే మనిషి. రాష్ట్ర ప్రజల మనస్సు గెలిచిన ఎన్టీఆర్‌ను దొంగతనంగానే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. చివరకి, టీడీపీని, ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను దుర్మార్గంగా దోచుకున్న దొంగ చంద్రబాబు. దొంగ ఓట్లు  చేర్పించటంలో కూడా చంద్రబాబు దిట్ట. ఇప్పుడు ఆధార్‌ ద్వారా ఆన్‌లైన్‌ సిస్టం రావటంతో దొంగ ఓట్ల బండారం బయటపడింది. దొంగ ఓట్ల కారకుడైన దొంగ చంద్రబాబే. 

ప్రజలే ఈ చంద్రబాబు మాకొద్దు బాబు అంటున్నారు. 600కి పైగా హామీలు ఇచ్చి మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి మాయం చేశారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళల హామీని నెరవేరుస్తూ నాలుగు సార్లు సాయం అందించారు. పప్పు, సుద్దపప్పు రోడ్ల మీద తిరుగుతుంటే వర్షాలు కూడా కురవటం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 

వైయ‌స్ జగన్‌ పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తుంటే.. కేసులు, రౌడీషీట్లు పెట్టించుకోమని లోకేశ్ అంటున్నాడు. పెద్దరికం, చిన్నరికం లేకుండా ఈ సుద్దపప్పు ఏం మాట్లాడుతున్నారు. కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని చెబుతున్నారు. ఏ కన్న తల్లి బిడ్డలపై కేసులు పెట్టించుకోమని ఎలా చెబుతావు. 

వైయ‌స్ జగన్‌ నాడు-నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశారు. అంతేకాకుండా అమ్మ ఒడితో పాటు స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు, ట్యాబ్ ఇచ్చి ఇంగ్లీషు మీడియం చదువులు నేర్పిస్తున్నారు. సీఎం వైయ‌స్ జగన్ చదువులు చెప్పి ప్రయోజకుల్ని చేస్తుంటే.. లోకేశ్‌ కేసులు పెట్టించుకోమనటం ఏమిటి? బిడ్డలపై రౌడీషీట్లు పెట్టించుకోమని లోకేశ్‌ ఎలా చెబుతాడు. 

వైయ‌స్ జగన్ అధికారంలోకి వస్తే.. ఏం చేస్తానో.. చెప్పారు. మీరు ఏం చెబుతున్నారు. ఒకాయన తాట తీస్తాను.. తోలు తీస్తాను, బట్టలు విప్పి కొంటాను అంటారు. చంద్రబాబు ఏమో.. చర్మం తీస్తాను, తోక కట్ చేస్తాను, మీ సంగతి తీస్తాను అంటారు. లోకేశ్ ఏమో.. ఎర్ర డెయిరీ పట్టుకుని.. మీ అందరి సంగతి రాస్తాను అంటావు. కొడాలి నాని బొటన వేలుపై వెంట్రుక కూడా పీకలేవు. ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నావు. నిన్ను చూస్తుంటే ఉత్తర కుమారుడే గుర్తుకు వస్తున్నావు. ఇలాంటి మాటలు మారుకోకపోతే.. ప్రజలు బుద్ధి చెబుతారు. 

మూడుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశారు. రాష్ట్రాన్ని శ్రీలంకలా తయారు చేస్తున్నారని అప్పుల పాలైపోయిందని చంద్రబాబు అన్నారు. మరి, ఈ పథకాల కంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు అంటున్నారు. మరి, ఈ పథకాలకు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తావు. చంద్రబాబువు అన్నీ అబ్రకదబ్ర మాటలు. పైగా ఇప్పుడు నేనే మీ నమ్మకం అని చంద్రబాబు చెబుతున్నారు. బాబు వస్తే.. జాబు వస్తుందన్నారు. 600 వాగ్దానాలు చేసి మేనిఫెస్టో నుంచి మాయం చేశారు. ప్రజలు నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. 

చంద్రబాబు హయాంలో ఎవరికైనా ఉచిత ఇసుక వచ్చిందా? ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిన్నారు. ఇసుక తరలింపును అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని కొడితే.. ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి.. ముఠా నాయకుడిలా చంద్రబాబు సెటిల్‌మెంట్ చేశారు. అలాంటి చంద్రబాబుకు ఇసుక గురించి మాట్లాడే హక్కుందా?

తాజా వీడియోలు

Back to Top