ప‌వ‌న్‌కు జ‌న‌సేన కార్యక‌ర్త‌కంటే.. చంద్ర‌బాబే ముఖ్యం

 పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

విజ‌య‌వాడ‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు త‌న‌ను న‌మ్ముకున్న జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌కంటే కూడా చంద్ర‌బాబే ముఖ్య‌మని మ‌రోసారి నిరూపించాడ‌ని పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు అన్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ తెలంగాణ‌లో స‌మావేశ‌మై.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కుట్ర చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌వ‌న్, చంద్ర‌బాబు భేటీపై మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ క‌లయిక కొత్త ఏమీ కాదని, ఇద్దరూ ఎప్పటినుంచో కలిసే రాజ‌కీయం చేస్తున్నార‌న్నారు. రాష్ట్రం గురించి, ప్రజల ప్రయోజనాల గురించి వారిద్ద‌రికీ పట్టదని, కేవ‌లం వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమ‌న్నారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి అనేదే ప్లాన్ అన్నారు. పవన్‌కు పేద ప్రజల ప్రాణాలు కంటే చంద్రబాబుబే ముఖ్యం. నాడు చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్‌ కనీసం మాట్లాడలేదు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సభల్లో కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటకు 11 మంది బలైనా పవన్‌ నోరెత్తలేదు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్నారు. 

Back to Top