సీఎం దెబ్బకు నియోజకవర్గాలు వెతుక్కునే ప‌నిలో తండ్రీకొడుకులు

కుప్పంలో పోటీకి వణికిపోతున్న చంద్రబాబు

పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన దెబ్బకు తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌ నియోజకవర్గాలు వెతుక్కునే పనిలో పడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు పేరు చెబితేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా, అర్హత ఉన్నవారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ఈసారి కుప్పంలో కూడా గెలవలేమని భయంతో చంద్ర‌బాబు వణికిపోతూ వేరే నియోజకవర్గం వెతుక్కుంటున్నారన్నారు. లోకేష్‌ను మంగళగిరిలో చిత్తుగా ఓడించిన తరువాత ఎక్కడ నుంచి పోటీ చేయించాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదన్నారు. అందుకే కొడుకు కోసం కూడా వేరే నియోజకవర్గం వెతికే పనిలో పడ్డాడన్నారు. 

ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లి, అధికారంలోకి రావాలని చంద్ర‌బాబు కుట్రలు చేస్తున్నాడని మంత్రి కారుమూరి మండిపడ్డారు. అవినీతి, లంచాలకు తావులేకుండా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అర్హులందరికీ సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని గుర్తుచేశారు. బాదుడే బాదుడు అయిపోయింది.. ఇదేం ఖర్మరా అని తిరుగుతున్న చంద్రబాబును చూసి ప్రజలంతా మాకిదేం ఖర్మరా బాబూ.. అని చంద్రబాబును తిట్టుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా.. ‘బాబూ నువ్వు మాకొద్దు’ అని దండాలు పెడుతున్నారన్నారు. 

Back to Top