సాగు చేసే ప్రతి పంట ఈ–క్రాప్‌లో రిజిస్టర్‌ చేయించాలి

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

విజయవాడ: వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువగా, మెరుగ్గా అందాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సీఎం ఆదేశాల మేరకు అన్ని వ్యవసాయ అంశాల్లో వ్యవసాయ మండళ్లను భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ సలహా మండళ్ల ఛైర్మన్ల అవగాహన సదస్సులో మంత్రి కన్నబాబు పాల్గొని మాట్లాడుతూ.. వ్యవసాయ మండళ్లకు రైతునే ఛైర్మన్‌గా నియమించాలని సీఎం ఆదేశించారన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టు సాగు, చేపలు రొయ్యల పెంపకం, సహకార తదితర అన్ని అంశాల్లో ఈ మండళ్లు తమ సూచనలను అందిస్తాయని చెప్పారు. సాగు చేసే ప్రతి పంట ఈ క్రాప్‌లో రిజిస్టర్‌ చేయించాలని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top