ఒత్తిడి లేని వ్యవసాయం మన నినాదం కావాలి

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తాడేపల్లి: ప్రకృతి వ్యవసాయంతో తక్కువ పెట్టుబడి.. అధిక ఉత్పత్తులు సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేశామని ఆయన చెప్పారు. ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను మంత్రి కన్నబాబు విడుదల చేశారు. 2742 కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయం అమలు జరుగుతుందన్నారు. ఒత్తిడి లేని వ్యవసాయం మన నినాదం కావాలని మంత్రి కన్నబాబు రైతులకు సూచించారు. రసాయనాలను పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేయాలని కోరారు. 
 

Back to Top