అధికారుల పనితీరు అభినందనీయం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

విశాఖపట్నం: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అధికారుల పనితీరు అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విశాఖలో మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి కలెక్టర్‌ విజయ్‌చంద్‌ ఏర్పాటు చేసిన 21 కమిటీలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. విశాఖ జిల్లాలోని రెడ్‌జోన్లపై అధికారులు మరింత దృషిసారించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారని, పేదల కోసం ప్రభుత్వం మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. పేదలను అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారని గుర్తుచేశారు. ప్రజలు కూడా లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు.

తాజా వీడియోలు

Back to Top