రైతు సంక్షేమమే సీఎం ప్రధాన అజెండా

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
 

కాకినాడ: రైతు సంక్షేమమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆరు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. కాకినాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ యోజన పథకం ద్వారా 40 లక్షల రైతులకు మేలు చేశామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం అమలు చేశామన్నారు. సంక్రాంతి తరువాత గ్రామ సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. త్వరలోనే విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల విక్రయాలు జరుగుతాయన్నారు. వచ్చే ఏడాది నుంచి రైతుల కోసం గ్రామీణ గిడ్డంగుల ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 

   
Back to Top