రైతు ఏ దశలోనూ నష్టపోకుండా చర్యలు

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 
 

తాడేపల్లి: రైతు ఏ దశలోనూ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. మార్కెటింగ్‌, సహకార శాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను మంత్రులు మీడియాకు వివరించారు. కన్నబాబు మాట్లాడుతూ..సహకార శాఖను ఆదునీకరించాలని, ఆరు నెలల కాలంలోనే ఈ పని పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు చెప్పారు. తీసుకున్న నిర్ణయాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు. ప్రధానంగా ఐదు పీసీసీలు ఉన్నాయని, ఇవి నష్టాల్లో ఉన్నాయని, వీటిని గాడిలో పెట్టాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఎక్కడైతే ఎన్‌పీఎస్‌లు ఉన్నాయో..వాటిని తగ్గించాలని సూచించినట్లు తెలిపారు. సహకార శాఖ, అబ్కాక్‌, ఆప్కోలను కూడా అధ్యాయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిపారు. మార్కెటింగ్‌, వ్యవసాయ ఉత్పత్తుల సమాచారం సేకరించేందుకు గ్రామ సచివాలయ ఉద్యోగుల సహకారం తీసుకోవాలని సీఎం చెప్పినట్లు వివరించారు. రైతు నష్టపోకూడదని, ఏ దశలోనైనా రైతుకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. గిట్టుబాటు ధరలను కూడా గ్రామ సచివాలయాల్లో రేట్లు రైతులకు అందేలా చూడాలని చెప్పారని తెలిపారు. అక్టోబర్‌ చివరినాటికి చిరుధాన్యాలపై బోర్డు, కోల్ట్‌ స్టోరేజీలపై సమగ్ర పరిశీలనకు సీఎం ఆదేశించినట్లు చెప్పారు.  ఆపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top