ఏ రైతు కూడా న‌ష్ట‌పోకూడ‌ద‌నే సంక‌ల్పం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ది

ఒంగోలులో పొగాకు కేంద్రం ప్రారంభం

ప్ర‌కాశం: ఏ రైతు కూడా న‌ష్ట‌పోకూడ‌ద‌నే గ‌ట్టి సంక‌ల్పంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్నార‌ని మంత్రి క‌న్న‌బాబు పేర్కొన్నారు.  ఒంగోలులో గురువారం మంత్రులు పొగాకు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి క‌న్న‌బాబు మాట్లాడుతూ.. పొగాకు కొనుగోళ్ల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గొప్ప నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్ల ప్ర‌క్రియ ఇక‌పై ప్ర‌తి ఏడాది కొన‌సాగుతుంద‌న్నారు. వ‌చ్చే ఏడాది నుంచి రైతు భ‌రోసా కేంద్రాల నుంచి పొగాకు రైతుల‌కు మేళ‌కువ‌లు నేర్పుతామ‌న్నారు. పొగాకు రైతుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్రోత్స‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా పొగాకు రైతుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదుకుంటున్నార‌ని చెప్పారు. వేలం కోసం వ‌చ్చిన పొగాకు బేళ్ల‌ను వెన‌క్కి పంపొద్ద‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. 

తాజా ఫోటోలు

Back to Top