వ్యవసాయ శాఖలో బడ్జెట్‌ కేటాయింపులు

వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాల బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి క‌న్న‌బాబు

అసెంబ్లీ: రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక గొప్ప సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాలను ఏడాదికాలంలో అమలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్‌ను అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టారు. 2020–21 సంవత్సరానికి గాను రూ.29,159.97 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. 

వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

 • రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
 • రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు
 • వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.500 కోట్లు
 • వైయస్‌ఆర్‌ సున్నావడ్డీకే పంట రుణాలకు రూ.1100 కోట్లు
 • రైతులకు ఎక్స్‌గ్రేషియోకు రూ.20 కోట్లు
 • రాయితీ విత్తనాల కోసం రూ.200 కోట్లు
 • వ్యవసాయ ల్యాబ్‌ల కోసం రూ.65 కోట్లు
 • వ్యవసాయ యాంత్రీకరణకు రూ.207.83 కోట్లు
 • ప్రకృతి వ్యవసాయానికి రూ.225.51 కోట్లు
 • ప్రకృతి విపత్తు నిధి రూ.2 వేల కోట్లు
 • ఎన్జీ రంగా యూనివర్సిటీకి రూ.402 కోట్లు
 • ఉద్యానవన అభివృద్ధికి రూ.653.02 కోట్లు
 • వైయస్‌ఆర్‌ ఉద్యాన వర్సిటీకి రూ.88.60 కోట్లు
 • పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.92.18 కోట్లు
 • పశు సంవర్థక శాఖకు రూ.854.77 కోట్లు
 • వెంకటేశ్వర పశువైద్యశాలకు రూ.122.73 కోట్లు
 • మత్స్య అభివృద్ధికి రూ.299.27 కోట్లు
 • సహకార శాఖకు రూ.248.38 కోట్లు
 • వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీకి రూ.4,450 కోట్లు
 • వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి రూ.6,270 కోట్లు

రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి.. 
2018–19లో 149.56 మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా.. 2019–20లో మా ప్రభుత్వం చేపట్టిన వివిధ వ్యవసాయ అనుబంధ పథకాలతో పాటు ప్రకృతి కూడా సహకరించడంతో రికార్డు స్థాయిలో 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, కంది, శనగ, మినుము పంటల్లో అధిక ఉత్పత్తి సాధ్యమైంది. 
 

Back to Top