పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తూర్పుగోదావరి: వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను మంత్రి కన్నబాబు పరిశీలించారు. సంబంధిత రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాలతో ముంపు ప్రాంతాల్లో పంట పొలాలను పరిశీలిస్తున్నామన్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ఎప్పటికప్పుడు పంటనష్టం అంచనాలను రూపొందిస్తున్నామని, నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top