పంట నష్టంపై అధికారుల అంచనా

మంత్రి కన్నబాబు
 

అమరావతి: వరదల కారణంగా నీటి మునిగిన పంటల నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేల బృందం పర్యటించింది. నీట మునిగిన పంటలను మంత్రి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. వరదలతో నష్టపోయిన ప్రతీ ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. రైతులకు అండగా ఉండాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయమన్నారు. చంద్రబాబు రైతు బాధలు వినకుండా తన ఇంటిని ముంచారనడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు కృత్రిమ వరద సృష్టించారనడం హాస్యాస్పదమన్నారు. 

Back to Top