వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నం

 
వరద పరిస్థితి, సహాయ కార్యక్రమాలపై మంత్రి కన్నబాబు ప్రకటన

సహాయక చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు

తక్షణమే విపత్తుల బృందాలను రంగంలోకి దించాం

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం

సహాయ చర్యల కోసం కలెక్టర్లకు నిధులు కేటాయించాం

పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాం

అమరావతి: వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నంగా ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. వరద పరిస్థితి, సహాయ కార్యక్రమాలపై మంత్రి కన్నబాబు ప్రకటన చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటుంది. వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. బాధిత ప్రాంతాలను ఆదుకోవడానికి ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి రోజు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రతి రోజు ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నాలు సాగుతున్నాయి. సమీక్షలు నిర్వహించడంతో పాటు సుదీర్ఘంగా చర్చించాం. ఎన్ని వ్యయ ప్రయాసలైనా సరే సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిమగ్నం కావాలని, అహర్నిషలు అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 34 మంది మృతి చెందారు. మరో 10 మంది గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. చనిపోయిన వారిలో రెస్క్యూ టీమ్‌ సభ్యులు ముగ్గురు ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. ఇప్పటికే చనిపోయిన 90 శాతం మందికి పరిహారం అందించాం. 8 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా.5,33,345 మంది రైతులు నష్టపోయారు. తక్షణ సాయం కోసం కలెక్టర్ల వద్ద నిధులు ఉంచాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. కడప, చిత్తూరు, నెల్లూరు కలెక్టర్ల వద్ద రూ.10 కోట్ల చొప్పున, అనంతపురం కలెక్టర్‌ వద్ద రూ.5 కోట్ల నిధులను సిద్ధంగా ఉంచారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే రూ.25 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. వరదలు, వర్షాల కారణంగా పాక్షికంగా ఇళ్లు దెబ్బతింటే ఇంటికి రూ.5,200, పూర్తిగా దెబ్బతింటే రూ.95 వేలు..ఇదికాకుండా ధ్వంసమైన ఇళ్ల స్థలాల్లో కొత్తగా ఇళ్లు మంజూరు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. విద్యుత్, రోడ్ల మరమ్మతులకు తక్షణమే యుద్ధప్రాతిదిక చేపట్టాలి. కలెక్టర్లు మానవతాదృక్పథంతో వ్యవహరించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. పాడి పశువులు చనిపోతే ఒక్కోక్కదానికి రూ.35 వేలు, గొ్రరెలు, మేకలు చనిపోతే ఒక్కొక్కదానికి రూ.3 వేల చొప్పున పరిహారం. పాడిపశువుల కోసం పశుగ్రాసం, దాణ సరఫరా తక్షణమే ప్రారంభించాలని, పంటల నష్టం అంచనా వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. అధికారులు సహాయక చర్యల్లో పాల్గొనాలని, కడపలో ఏపీ సీడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఉంచాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేయాలన్నారు. ఇరిగేషన్‌ అధికారులు చెరువుల గండ్లు పూడ్చి, మరమ్మతులు చేపట్టాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఏవిధంగా అలక్ష్యం చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. 

 

తాజా ఫోటోలు

Back to Top