హౌస్‌ కమిటీ అంటే టీడీపీకి భయమెందుకు?

మంత్రి కన్నబాబు
 

అమరావతి: పెగాసస్‌ అంశంపై అసెంబ్లీలో హౌస్‌ కమిటీ వేస్తామంటే టీడీపీ ఎందుకు భయపడుతుందని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. హౌస్‌ కమిటీలో అన్ని పార్టీల సభ్యులుంటారని, విచారణ జరిగా జరుగుతుందన్నారు. ఈ కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోలేరన్నారు..దొరికిపోతారని పేర్కొన్నారు. హౌస్‌ కమిటీ విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయని తెలిపారు. తప్పు చేశాం, ప్రాయశ్చిత్తం  చేసుకుందామని కూడా టీడీపీ లేదన్నారు. ఆనాడు ఐటీ మంత్రిగా నారా లోకేష్‌ ఉన్నారని, హౌస్‌ కమిటీపై నారా లోకేష్‌ చాలా తేలికగా మాట్లాడుతున్నారని విమర్శించారు.  త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని మంత్రి కన్నబాబు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top