సానుభూతి  కోసమే చంద్రబాబు ఏడ్పు డ్రామా!

మంత్రి కురసాల కన్నబాబు

చంద్రబాబు సతీమణి గురించి ఎవరూ తప్పుగా మాట్లాడలేదు

బాబు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టిస్తారే తప్ప..కన్నీళ్లు పెట్టుకోరు

కుప్పం ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు

చంద్రబాబుకు ఎప్పుడూ పదవి కావాలి

పదవి కోసం చంద్రబాబు ఎవరినైనా వాడుకుంటారు

ఏదో ఒక అబద్ధాన్ని బాబు సృష్టిస్తే..ఎల్లోమీడియా మార్కెట్‌ చేస్తుంది

చంద్రబాబు ఒక్కరోజూనై విలువలతో కూడిన రాజకీయం చేశారా? 

కాకినాడ: సానుభూతితో వచ్చే ఎన్నికలకు వెళ్దామనే దురుద్దేశంతో చంద్రబాబు ఏడ్పు డ్రామాలు మొదలుపెట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సభలో చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరూ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సతీమణి గురించి ఎవరూ తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టిస్తారే కానీ..కన్నీళ్లు పెట్టుకోరని తెలిపారు. టీడీపీ ఓటమిపై ఒక్కసారైనా చంద్రబాబు సమీక్షించుకున్నారా అని ప్రశ్నించారు. పొలిటికల్‌ ఎజెండాతోనే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడలో ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. 

నిన్నటి సభలో వ్యవసాయ రంగంపై చర్చ జరిగింది. ఆ సమయంలో టీడీపీ సభ్యలు బాబాయ్‌ గొడ్డలి అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులే వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టారు. తానేదో పార్టీలు మారనని, ఇంతకుముందు వైయస్‌ జగన్‌ను దూషించానని మాట్లాడారు. ఆ క్రమంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయినా కూడా తాను వ్యవసాయ రంగంపై మాట్లాడుతున్నాను. ఈ సమయంలోనే చంద్రబాబు మైక్‌ కావాలని కోరితే..స్పీకర్‌ మైక్‌ ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు లేచి..అన్ని మాట్లాడుకుందాం..పార్టీలు మారడం నుంచి బాబాయి, గొడ్డలి, తల్లి అని చంద్రబాబు అన్నారు. టీడీపీ సభ్యులు బాబాయి, గొడ్డలి అని నినాదాలు మొదలు పెట్టారు. దానికి ప్రతిగా ఆ రోజు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నట్లుగా పార్టీ లేదు..బొక్కా లేదు అన్న వ్యాఖ్యలను వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు గుర్తు చేశారు. ఆ తరువాత సభ సద్దుమణిగింది. మళ్లీ నా ప్రసంగాన్ని మొదలుపెట్టాను.

డయిరీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. హెరిటేజ్‌ గురించి కూడా చర్చ వచ్చింది. రైతులను ప్రైవేట్‌ సంస్థలు మోసం చేస్తున్నాయని చెప్పాను. సీఎం వైయస్‌ జగన్‌ జగనన్న పాల వెల్లువ పేరిట అమూల్‌ అనే సంస్థతో అనుసంధానం చేశారని తాను మాట్లాడుతున్నా..వెంటనే చంద్రబాబు లేచి హెరిటేజ్‌ గురించి మాట్లాడుతారా అంటూ పెద్ద ఎత్తున ఉద్రేకపడ్డారు. దానికి వారి సభ్యులందరూ మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో మా సభ్యులు కూడా నినాదాలు చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడటానికి లేస్తే..ఆయనపై టీడీపీ నేతలు కామెంట్లు చేశారు.ఈ క్రమంలో అంబటి స్పందిస్తూ అన్నీ మాట్లాడుకుందాం..వంగవీటి హత్య, మాధవరెడ్డి గురించి మాట్లాడుదామన్నారు. అక్కడ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి  గురించి ఎవరూ మాట్లాడలేదు. మహిళల ప్రస్తావన అన్నది సభలో రాలేదు. ఎవరూ కూడా ఆ పేరు ఎత్తలేదు. ఏదో మహిళలను కించపరిచి మాట్లాడినట్లుగా చంద్రబాబు ఒక ప్రచారం చేయడం మొదలుపెట్టారు. చాలా విచిత్రంగా అనిపించింది. గాలిలో నుంచి సృష్టించినట్లుగా చంద్రబాబు తన భార్యను ఎవరో కించపరిచారని బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

అంతకుముందు చంద్రబాబు వాకౌట్‌ చేసేందుకు స్టేట్‌మెంట్‌ ఇస్తామంటే స్పీకర్‌ మైక్‌ ఇచ్చారు. ఆ మైక్‌లో అయినా చంద్రబాబు కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఏమీ చెప్పలేదు. ఆ తరువాత ప్రెస్‌ మీట్‌ పెట్టి ఆయన సతీమణిని తప్పుడుగా మాట్లాడినట్లు ఉద్రేకపడుతూ..ఏమోషనల్‌ అవుతూ కంటతడి పెడుతూ..చాలా బాధపడుతున్నట్లు ఒక వీడియో చూశాం. చంద్రబాబు బాధపెట్టే తత్వమే కానీ, బాధపడరు. కన్నీళ్లు పెట్టిస్తారే కానీ, ఆయన ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడు. ఎన్టీఆర్‌ వద్ద నుంచి ప్రతి ఒక్కరిని ఏదో ఒకరిని కన్నీరు పెట్టించారు. లక్ష్మీపార్వతిని, ఎమ్మెల్యే రోజాతో టీడీపీ సభ్యులతో మాట్లాడించిన మాటలు అన్ని గుర్తున్నాయి. జరగని దాన్ని జరిగినట్లు చెబుతూ..ఆయన భార్యను కించపరిచినట్లు సానుభూతిని ప్రజల్లో కోరుకుంటున్నారు. ఎందుకు చంద్రబాబు సానుభూతిని కోరుకుంటున్నారు.  మీ భార్యను ఎవరూ కించపరిచారో చెప్పగలరా? మీకు మీరే అన్వయించుకోవడం సరికాదు. మేమందరం కూడా సంస్కారవంతులమే. అందరికీ భార్య, తల్లి, చెల్లి ఉన్నవాళ్లమే. 
సభలో నుంచి బయటకు వస్తుంటే చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో ఏడ్చారంటే ఎవరం కూడా నమ్మలేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి దెబ్బతగలడంతో వచ్చే ఎన్నికలకు సానుభూతితో వెళ్లాలని, వైయస్‌ఆర్‌సీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చిత్రీకరించేందుకు కుట్ర చేస్తున్నారని భావిస్తున్నాను. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి..ఇలా వ్యవహరించడం దుర్మార్గం. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను తన పదవి కోసం ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు. ఎన్టీఆర్‌ కుమారులను, దగ్గుపాటి వెంకటేశ్వర్లును ఎలా వాడుకున్నారో అందరం చూశాం. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు. 
12.26 నిమిషాలకు సభను బాయ్‌కట్‌ చేసి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన ఏమీ మాట్లాడలేదు. తన పార్టీ నేతలందరిని పిలిపించుకొని ఏం మాట్లాడాలి. ఎలా మాట్లాడాలో మీటింగ్‌లో చర్చించి, ఆ తరువాత మీడియా ముందు ఏడ్చారంటే అది ఫ్యాబ్రికేటెడ్‌ అని అర్థమవుతుంది. 

ఇది గౌరవ సభ కాదు..కౌరవ సభ అని చంద్రబాబు నిన్న మాట్లాడారు. మేమంతా కౌరవులమా? నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు సభను కౌరవ సభ అని మాట్లాడుతావా? నిరంతరం రాజకీయమే ఊపిరిగా బతికావు. ఇప్పటికైనా సరే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. నాయకత్వానికి ఇంతకంటే ఏముంటుంది. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ఎందుకు అనుకోవడం లేదు. పదవి కోసం చంద్రబాబు ఎవరినైనా వాడుకుంటారు. 

వ్యవసాయం గురించి టీడీపీ సభ్యులు ప్రశ్నిస్తారేమోనని బాగా ఫ్రిఫైర్‌ అయ్యాను. వ్యవసాయం గురించి చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు వద్ద అబద్ధాల ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ అబద్ధాలను మార్కెటింగ్‌ చేసేందుకు ఒక ప్రతిష్టమైన వ్యవస్థ ఉంది. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించే మార్కెటింగ్‌ వ్యవస్థ చంద్రబాబుకు ఉంది. కొన్ని పత్రికలు, చానల్స్‌ అబద్ధాలను ప్రచారం చేస్తాయి. నిన్న సభలో జరగని దాన్ని జరిగినట్లు చిత్రీకరించారంటే ఏం చెప్పాలి. ఇది దుర్మార్గం కాదా? ఇది మంచి పద్దతేనా? వైయస్‌ జగన్‌ ఇవాళ రాష్ట్రంలో బలమైన నాయకుడిగా అవతరించారు. ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా ఒంటరిగా వచ్చి కుంభస్థలాన్ని ఢీకొట్టినట్లుగా ఏకంగా అసెంబ్లీలో 151 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అత్యుత్తమ పనితీరు చూపుతున్న ముఖ్యమంత్రుల్లో వైయస్‌ జగన్‌ ముందు వరుసలో ఉన్నారు. అలాంటి నాయకుడిని ఎదుర్కొవాలంటే చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు సాధ్యపడవు.

ఒక నాయకుడిగా వైయస్‌ జగన్‌ అన్ని కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళలను కించపరిచే నాయకత్వమా? కించపరిచే పార్టీనా? ప్రతి పథకాన్ని అక్కచెల్లెమ్మల పేరుతో చేయాలి. ఇంటి పట్టా..వైయస్‌ఆర్‌ చేయూత..ఏదైనా సరే అక్కచెల్లెమ్మల పేరుతోనే చేస్తున్నారు. మాకు అదే చెబుతారు. అదే చేసి చూపుతున్నారు వైయస్‌ జగన్‌. మహిళల పట్ల వైయస్‌ జగన్‌ ఎంత గౌరవంతో ఉంటారో మేమంతా చూశాం. ఏ ఒక్క మహిళనైనా అమ్మా అంటూ సంభోదిస్తారు. మీరు మాత్రం రాజకీయ అవసరం కోసం జరగని దాన్ని జరిగినట్లుగా చూపిస్తున్నారు.

ఇవాళ బాలకృష్ణ ప్రెస్‌మీట్‌ పెట్టారు. వాస్తవాలు ఆయనకు తెలిసి ఉండవని అనుకున్నాను. సభలో నిన్న బాలకృష్ణ లేరు. బాలకృష్ణ మాట్లాడుతూ..నోటితో కాదు..ఓటుతో వీళ్లకు జవాబు చెప్పాలని అన్నారు. అంటే అర్థమేంటో..నిరంతర రాజకీయమే కదా? సానుభూతితో ఓట్లు సంపాదించుకోవాలనే చంద్రబాబు కుట్ర బాలకృష్ణకు తెలియకుండానే మాట్లాడారా?. మేము కుసంస్కారులమా?. నిన్నటి ప్రోసిడింగ్స్‌ అన్ని గమనించండి. వైయస్‌ జగన్‌ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మొదట నేనే రియాక్ట్‌ అయ్యాను. ఆ వ్యాఖ్యలను రికార్డ్స్‌ నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరాను. ఎందుకు ఈ విధంగా దిగజారి రాజకీయాలు చేస్తారు.

నిన్న రాత్రి దిష్టిబొమ్మలు దహనం చేస్తారు. ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునిస్తారు. ఇవన్నీ రాజకీయం కాదా?. గెలుపు ఒటమి సహజం అని మీకు తెలియదా? కుప్పంలో ఇన్నాళ్లు గెలిచారు. ఇప్పుడు ఎందుకు ఓడిపోయారో మీకు తెలియదా? వైయస్‌ జగన్‌ బలం ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి ప్రతి  ఎన్నికలోనూ వైయస్‌ఆర్‌సీపీ గెలుస్తోంది. అమరావతిలోని రెండు నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం వల్లే కదా టీడీపీ ఓడిపోయింది. ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తున్నారో ఒక్కసారైనా ఆలోచన చేశారా?. ప్రజల తిరస్కరణకు గురై..ఏం చేయాలో పాలుపోక, రాజకీయంగా ఒక వర్గ శత్రువుగా వైయస్‌ఆర్‌సీపీని, వైయస్‌ జగన్‌ను చూస్తున్నారు. చంద్రబాబు కొత్త ఎత్తుగడగా సానుభూతి ఓట్ల కోసం చేస్తున్నారని చెప్పడానికి నిన్న జరిగిన ఎపిసోడ్‌ నిదర్శనం. ప్రజలు చాలా తెలివైనోళ్లు..ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ప్రతిసారి కుట్రలు, కుతంత్రాలు చేయడం కాదు. విలువలతో కూడిన రాజకీయం చేయాలి.

భువనేశ్వరి నాకు అక్కలాంటిది. నిన్నటి చంద్రబాబు తీరుతో ఆమె ఎంతగా బాధపడి ఉంటారు. ఇక్కడేదో జరిగిపోయిందని తప్పుగా అనుకొని ఎంతగా బాధపడి ఉంటారు. చంద్రబాబు తీరు కరెక్ట్‌కాదు. ఎమ్మెల్యే రోజా కన్నీరుమున్నీరుగా ఏడ్చారో అందరికీ తెలుసు. చంద్రబాబు ఎడవటం ఏంటి? రెండు చేతులతో ముఖాన్ని దాచుకొని కుమిలి కుమిలి ఏడ్వటం ఏంటి? రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయితే..సీఎం వైయస్‌ జగన్‌ ఆ జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ వర్షాలపై దృష్టి పెట్టారు. నిన్నటి సభలో ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడుతారేమో అనుకున్నాం. ఇవేవి కూడా ఆయనకు పట్టలేదు. పోలిటికల్‌ ఎజెండాతో చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.

 

తాజా ఫోటోలు

Back to Top