అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం

మంత్రి కన్నబాబు 

అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు

రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి వర్తింపు

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై గత ప్రభుత్వం గందరగోళం సృష్టించింది

కాపులను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు ఉదాహరణ

విజయవాడ: అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకం నిర్ణయమని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

కురసాల కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. ఆయన మాటల్లోనే...

 ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గారు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటిస్తూ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. చాలాకాలం నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై చర్చ జరుగుతుంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు ఉద్యోగాల్లో కూడా 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. వాటి అమలు కోసం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. 
- జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రవర్ణ పేదలకు విద్యాపరంగా సీట్ల కేటాయింపుల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. జులై 27, 2019న జీవో ఇచ్చారు కూడా. 

 అన్ రిజర్వడ్ కేటగిరిలో ఉన్న, అన్ని సామాజికవర్గాల్లో ఉన్న పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇందులో ఎలాంటి సబ్ కేటగిరైజేషన్ కూడా లేదు. వార్షికాదాయం రూ. 8లక్షలు మించకుండా ఉండాలనే నిబంధన ఒక్కటి మాత్రమే ఉంచి, కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన కొన్ని నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు, విద్యాపరమైన  సీట్ల కేటాయింపుల్లో తొలగించటం జరిగింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయనిపుణులతో చర్చించి, ఎటువంటి సందిగ్ధతకు తావు లేకుండా చాలా స్పష్టతతో ఈ జీవో విడుదల చేశాం. 

 గతంలో చంద్రబాబు కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేయాలని చూశారో గమనిస్తే.. ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు  కేటాయించడం చర్చనీయాంశమైంది. దీనిపై చాలా మంది కోర్టుల్లో కేసులు వేశారు. పిల్ లు వేశారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 
- చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.  "కాపులను  బీసీల్లో ఎఫ్ కేటగిరి అని సృష్టించి ఒక తీర్మానం చేశారు, మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లలో  5 శాతం కాపులకు ఇస్తున్నట్టుగా మరో తీర్మానం చేశారు. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలని కేంద్రం కోరితే.." చంద్రబాబు దాని మీద స్పందించకుండా, సమాధానం చెప్పకుండా అటకెక్కించారు. ఈ విషయాన్ని అలా మూలన పెట్టి, ఆ వర్గాలను గందరగోళపరిచి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారు. 

 వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక.. విద్యార్థులకు నష్టం జరగకూడదని నిర్ణయం తీసుకుని ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఉద్యోగాల కల్పనలో కూడా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మేలు చేసేందుకు, సుప్రీం, హైకోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ, వీటన్నింటినీ అధ్యయనం చేశాక ముఖ్యమంత్రి గారు ఈ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. 

 ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రామాణికంగా తీసుకుని.. అగ్రవర్ణాల్లోని కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మ, రెడ్లు.. ఎవరైతే రిజర్వేషన్లు పొందని ఇతర సామాజికవర్గాలంతా వీటి పరిధిలోకి వస్తారు. కేంద్రం విధించిన నిబంధన మేరకు వాస్తవానికి, కుటుంబ వార్షికాదాయం 8 లక్షలు మించకపోవడంతోపాటు 5 ఎకరాలు లోపు వ్యవసాయ భూమి ఉండాలి, వెయ్యి అడుగుల దాటిన రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉండకూడదు, పట్టణాల్లో 100 గజాల స్థలం ఉండకూడదు లాంటి పలు నిబంధనలు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అగ్రవర్ణాల్లోని ఎక్కువ మంది పేదలకు లబ్ధి పొందేందుకు వీలుగా రూ. 8 లక్షల ఆదాయాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని రిజర్వేషన్లు ప్రకటించారు. ఆదాయానికి సంబంధించి తహసిల్దార్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చాం. 

  ఇంతకాలం చంద్రబాబు దొరికిన వర్గాన్ని దొరికినట్టుగా ఏ విధంగా మోసం చేశారనే దానికి గతంలో ఆయన ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లే పెద్ద ఉదాహరణ. కాపులను ఎఫ్ కేటగిరి పేరుతో బీసీల్లో చేర్చామని చెప్పారని, ఆ తర్వాత కేంద్రం ప్రకటించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించానంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి వేర్వేరుగా రెండు తీర్మానాలు పంపించి,  కాపులను చంద్రబాబు పచ్చి దగా చేశారు. చంద్రబాబు దృష్టిలో కాపు సామాజికవర్గ ప్రజలు బీసీలా.. ఓసిలా.. ?. చంద్రబాబు జిమ్మిక్కులు, ట్రిక్కులను కాపులు నమ్మకుండా గత ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు.
- ఏదోరకంగా ప్రజలను మోసం చేసి, ఎంతసేపటికీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తప్ప.. చంద్రబాబుకు ఏ వర్గం అన్నా చిత్తశుద్ధి లేదు. 

 2014 టీడీపీ మేనిఫెస్టోలో అయితే ఏకంగా కొన్ని వర్గాలను ఎస్సీల్లో, మరికొన్ని వర్గాలను ఎస్టీల్లో చేరుస్తానని హామీలు ఇచ్చారు. దీనినిబట్టి పచ్చి అబద్ధాల పుట్టలా టీడీపీ, చంద్రబాబు కనిపిస్తున్నారు. సిగ్గు, శరం లేకుండా ఏ వర్గాన్ని అయినా మోసం చేసి, వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకే చంద్రబాబు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. 

8- కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను కూడా దృష్టిలో పెట్టుకుని, ఇంకా ఆలస్యమైతే ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు పొందాల్సిన అగ్రవర్ణాల పేదలుఇ నష్టపోతారనే అభిప్రాయంతో ముఖ్యమంత్రిగారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక గొప్ప మనసున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అన్నివర్గాలను ఆదుకోవాలనే ముఖ్యమంత్రిగారి గొప్ప సంకల్పం ఇందులో కనిపిస్తుంది. 

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..

  దురదృష్టం ఏంటంటే.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి కొన్ని పత్రికల్లో వేర్వేరు వర్షన్స్ తో వార్తలు వచ్చాయి. 
- ఈనాడులో వార్త చదివితే మీరన్నా సిగ్గుపడాలి. చదువుకున్నోళ్ళు అన్నా సిగ్గు పడాలి. మీకు ఇంగ్లీషు అయినా రాదనుకోవాలి. లేదంటే అవగాహన అన్నా లేదనుకోవాలి. అందుకే ముఖ్యమంత్రి గారు క్రింది స్థాయి నుంచి విద్యారంగంలో ఇంగ్లీషు మీడియం ఉండాలని చెబుతున్నారు.  
- కేంద్రం విధించిన పరిమితులు అన్నీ తొలగించి.. రూ. 8  లక్షలు కుటుంబ వార్షికాదాయం మాత్రమే ఉండాలని జీవో ఇస్తే.. ఏదో గందరగోళం సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించాలన్న ఆలోచన మీకు ఎందుకు..?
- రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చిన జీవో నంబరు 66 చూస్తే.. పేరా 2లో సెంట్రల్ గవర్నమెంటు ఈడబ్ల్యూఎస్ లో ఏం చెప్పింది. ఆపరేషన్ గైడ్ లైన్స్ తీసుకుంటే పేరా నంబరు 19-20లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే దానికి ఇవి గైడ్ లైన్స్ అని చెప్పాం. అందులో  రూ. 8 లక్షలు వార్షికాదాయం ఉండాలి. అది కూడా జీతం, వ్యవసాయం తదితరాలకు సంబంధించినది అని స్పష్టంగా అందులో ఉంది. 

 ప్రజల్ని మోసం చేయడంలో చంద్రబాబు పెద్ద పండితుడు. ఆయనకు తెలియకపోతే.. ఈనాడు ఆ పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది.  థ్యాంక్స్ టు ఈనాడు. ఎందుకంటే, రెండేళ్ళలో ఈ ప్రభుత్వం 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మీరు ఒప్పుకున్నందుకు. మేం ఇచ్చినవి ఉద్యోగాలు కాదు అని మీరే అంటారు. మీరు ఇచ్చిన 5 లక్షల ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాలేదని మళ్ళీ మీరే మాట్లాడతారు. ఈ ద్వంద్వ ప్రమాణాలేమిటి అని అడుగుతున్నాం.  ఉద్దేశపూర్వకంగా ప్రజలను పక్కదారి పట్టించవద్దని కోరుతున్నాను.

 రిజర్వేషన్లలో చంద్రబాబు ఎంత గందరగోళం సృష్టించారంటే.. తెలిసి మరీ తప్పు చేశారు. కాపుల్ని భ్రమల్లో ఉంచారు. కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేశాడు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మీద తీవ్రమైన దమనకాండ జరిపించాడు. జైల్లో నిర్భందించినట్టుగా ఆసుపత్రిలో నిర్భందించి, వారి కుటుంబానికి చెందిన మహిళలను కూడా అవమానించారు. నిజాయితీగా ఉన్న నాయకులను నమ్ముతారు తప్ప.. జిమ్మిక్కులు, ట్రిక్కులు చేసే చంద్రబాబు లాంటి వారిని ప్రజలు ఎప్పటికీ నమ్మరు. కాపులు బీసీల్లో ఎఫ్ తీసుకోవాలా.. లేక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల లో 5 శాతం తీసుకోవాలో చెప్పకుండా తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి అన్నట్టుగా.. చంద్రబాబు చేసిన కార్యక్రమానికి ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అన్ని వర్గాలకు సమానమైన న్యాయం జరగాలి. రాజ్యాంగ పరిధిలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలి తప్పితే.. ఉత్తుత్తి మాటలు మేం చెప్పమని జగన్ మోహన్ రెడ్డిగారు ఎన్నికల ముందే చెప్పారు. 

 మరో జీవో నంబరు 65.. దీని ప్రకారం విద్యారంగంలో ఇప్పటికే అమలవుతున్న 10 శాతం ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి.. కేంద్రం విధించిన నిబంధనలను అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం తొలగించి, కేవలం రూ. 8 లక్షల వార్షికాదాయం మాత్రమే నిబంధన విధించాం.

 

Back to Top