చంద్రబాబు నిర్వాకంతోనే  రైతులకు ఈ దుస్థితి

గత ప్రభుత్వ విత్తన సేకరణపై దృష్టి పెట్టలేదు..

రైతులకు చేయాల్సిన నష్టం చేసి ప్రతిపక్ష పాత్రపై ఊబలాటం ఎందుకు?

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

 

అమరావతిఃవిత్తనాల సేకరణపై చంద్రబాబు నిర్వాకాన్ని ఆధారాలతో సహా ఎండగడతామని  వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం సేకరణ సొమ్మును కూడా దారి మళ్లీంచారని మండిపడ్డారు.చేయాల్సిన నష్టం చేసి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కోసం ఊబలాట పడుతున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు వల్లే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి సంవత్సరం విత్తన సేకరణకు ఒక ప్లాన్‌ఉండాలని, నవంబర్‌ నుంచి ప్లాన్‌ చేసుకుని మార్చి నాటికి సేకరణ పూర్తిచేసుకుని మే నాటికి సిద్ధం చేయాలన్నారు. గత ప్రభుత్వం విత్తన సేకరణపై దృష్టి పెట్టాలేదన్నారు.విత్తన సేకరణ చేసిన సంస్థలకు కూడా బిల్లులు చెల్లించలేదన్నారు.జనవరి నుంచి విత్తనాల సేకరణకు నిధులు అడిగిన ఇవ్వలేదని 28 సార్లు అధికారులు చంద్రబాబుకు లేఖలు రాసిన పట్టించుకోలేదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రాసిన లేఖలను టీడీపీ కార్యాలయానికి పంపిస్తానని  ధైర్యం ఉంటే చంద్రబాబు,లోకేష్‌లు సమాధానం చెప్పాలన్నారు.చంద్రబాబు రైతులను ముంచేసినా విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

Back to Top