వ్య‌వ‌సాయ రంగానికి అగ్రిక‌ల్చ‌ర్ కౌన్సిల్ బిల్లు అవ‌స‌రం

మంత్రి క‌న్న‌బాబు
 

అమ‌రావ‌తి: దేశానికి వెన్నముఖగా నిలిచిన వ్యవసాయ రంగానికి అగ్రిక‌ల్చ‌ర్ కౌనిల్స్ బిల్లు అవసరమని వ్య‌వ‌సాయ మంత్రి క‌న్న‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ బిల్లును మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదో చారిత్రక బిల్లు అని, రైతులకు మరింత మేలు చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్టు చెప్పారు.  అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు విషయంలో ఏపీ ముందుడుగు వేసిందన్నారు. రైతులకు సరైన సూచనలు, వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ బిల్లును తీసుకొచ్చమన్నారు. ఈ బిల్లు ఉభయ తారకంగా ఉంటుం‍దని క‌న్న‌బాబు పేర్కొన్నారు.

Back to Top