తెలంగాణాలో కేజీ ఉల్లి రూ.45  

ఏపీలో కేవలం రూ.25లకే రైతు బజార్ల ద్వారా ఇస్తున్నాం

మంత్రి కురసాల కన్నబాబు

అసెంబ్లీ: దేశంలో ఎక్కడా లేని విధంగా కిలో ఉల్లిపాయలు కేవలం రూ.25లకే ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కరే అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఈమధ్యన ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక రాజకీయ అవకాశం కోసం ఎదురుచూస్తూ మొన్న ఇసక ప్యాకెట్లు దండ మెళ్లో వేసుకుని రోడ్లమీదకొచ్చారు. నిన్న ఉల్లిపాయల దండలేసుకుని అసెంబ్లీకొచ్చారు. ఉల్లిపాయల కోసం వినియోగదారులు చనిపోయారని గొడవ చేసారు. నిజం ఏంటని ఆరా తీస్తే ఆ వ్యక్తి చనిపోయింది వేరే కారణాలవల్ల అని ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. ఎక్కడో జరిగిన సంఘటనను తెచ్చి ఉల్లిపాయలకు లింక్ చేసి, కీలకమైన మహిళా బిల్లుపై జరిగే చర్చను పక్కదారి పట్టించిన నీచ రాజకీయాలు ప్రతిపక్ష టీడీపీ చేస్తోంది. 
వ్యవసాయ శాఖా మంత్రిగా రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. 
మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎంతోకీలకమైనది. సీఎంగారు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి ఛైర్మన్ ను నియమించారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా మీటింగ్ నిర్వహిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మీద ఫస్ట్ ఎజెండా ఐటమ్ గా ఆయనే రివీల్ చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం వ్యవసాయ మిషన్ కమీషన్ మీటింగ్ లో చర్చించిన ఎజెండాలో సీఎం చెప్పిన విషయం ఏమిటంటే - ఏ వ్యవసాయ ఉత్పత్తికైనా ఫ్లోర్ కాస్ట్ ఉండాలి. రాబోయే 3 నెలల్లో ఏ సమస్యలు రాబోతున్నాయి, వాటిని అధిగమించేందుకు మనం అనుసరించబోయే విధానం ఏమిటి, ఎలాంటి ప్రిపరేషన్ ఏమిటీ అన్న విషయాలపై చర్చించారు. ఉల్లిపాయల విషయంలో మాత్రమేకాదు మిర్చి, వేరుసెనగ, పత్తి ఇలా ఏ ఉత్పత్తి విషయంలో అయినా సరే వాటిపై సమీక్ష చేస్తున్నారు. ఉల్లి వేసేప్పుడు వర్షాభావం వల్ల, తీసే సమయానికి అధిక వర్షాల వల్లా నష్టం జరిగి ఉల్లి ఉత్పత్తి తగ్గిపోయింది. నేడు వినియోగదారుడికి ఉల్లి భారం కాకుండా ఉండేందుకు సగటున కేజీకి రూ.100 సబ్సిడీ ఇచ్చి రైతు బజారులో అమ్మిస్తున్నారు. నేటి పరిస్థితుల్లో దేశంలోని ఏ రాష్ట్రమైనా వినియోగదారుడికి ఉల్లిపాయల మీద రూ.100 సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉందా? పక్కనేఉన్న తెలంగాణాలోనూ కేజీ రూ.45 రూపాయిలకు రైతు బజార్లో అమ్ముతున్నారు. వాలంటీర్లతో ఇంటింటికీ ఉల్లిపాయలు సరఫరా చేయమని ప్రతిపక్ష సభ్యులు కోరుతున్నారు. కోటిన్నర కుటుంబాలకు ఉల్లిపాయ సప్లై చేయాలంటే 15000 టన్నులు ఉల్లి కావాలి. అంత ప్రొడక్షన్ అసలు ఉందా? రోజుకు 3000 టన్నుల ఉల్లి అవసరం అవుతుంటుంది. కర్నూలు, తాడెపల్లి గూడెం మార్కెట్లు మనకు మెయిన్. వాటి నుంచి ఉల్లి పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా నిఘా ఏర్పాటు చేయాలని విజలెన్స్ ఐజీతో చర్చించి ఆదేశాలిచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్. 

ఇంత వరకూ రైతుల నుంచి ఉత్పత్తులను సేకరించిన ప్రభుత్వాలు ఉన్నాయి కానీ మార్కెట్ నుంచి అది కూడా మార్కెట్ రేటు చెల్లించి మరీ ఉత్పత్తులు సేకరించిన ప్రభుత్వమే లేదు. అంతేకాదు టమాటో రేటు పడిపోతే వెంటనే స్పందించి, కొనుగోలు చేసి వేరే మార్కెట్లకు పంపించి దళారులను అరికట్టిన చరిత్ర మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిది. వినియోగదారుల కోసం సమయానుకూలంగా స్పందించిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. వినియోగదారులకు పూర్తి సబ్సిడీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్. దీన్ని ప్రతిపక్షాలు మెచ్చుకోవాలి. అంతేకానీ రాజకీయాన్ని వ్యవసాయానికి, వ్యవసాయ ఉత్పత్తులకూ కూడా ముడిపెట్టి వాడుకోవడం భావ్యం కాదు. నిన్న కీలకమైన మహిళా బిల్లు గురించి మాట్లాడుతుంటే ఉల్లిపాయల గురించి గొడవ చేసింది ప్రతిపక్షం. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ప్రతి సమీక్షలో మాకో విషయం చెబుతుంటారు. ఒకరితో మనం చెప్పించుకునే పరిస్థితి తీసుకురావద్దు. ముందుగానే మనం మేల్కొనాలి. ముందుగానే సమస్యను పసిగట్టండి. పరిష్కరించడానికి ఏం చేయాలో చెప్పండి. దేశం మొత్తం మీద రూ.3000 కోట్ల రూపాయిల మార్కెట్ ఇంటర్వెన్షన్‌ ఫండ్ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే. ఆ ఫండ్ నుంచి శెనగరైతులకు రూ.330 కోట్లు, గత ప్రభుత్వం పేపర్ మిల్లులకు జామాయిలు కొని డబ్బులు ఎగ్గొడితే అందుకోసం రూ.5 కోట్లు, ఆయిల్ పామ్ రైతులకు తెలంగాణాతో సమానంగా ధర రావడం లేదంటే రూ.85 కోట్లు ఇస్తున్న పెద్ద మనసు మన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిది. 

నిన్నటి రోజున ప్రతిపక్షం చేసిన ఆందోళన, పోడియం వద్దకు వచ్చి వారు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలకోసం జరిగిన తొక్కిసలాటలో మరణం జరిగిందని అబద్ధాలు ప్రచారం చేసి సభను తప్పుదారి పట్టించారు. కనుక క్షమాపణ చెప్పి తీరాలి. 

Read Also: 38,496 క్వింటాళ్లు ఉల్లి విక్ర‌యించాం

తాజా ఫోటోలు

Back to Top